IPL 2024 Mumbai Indians Rohith Sharma : ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబయి వేదికగా తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త ఫీట్ నమోదు చేశాడు హిట్ మ్యాన్.
ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ(11) సునీల్ నరైన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. సునీల్ నరైన్ బౌలింగ్‌లో రోహిత్ ఔటవ్వడం ఇదేం కొత్త కాదు. మొత్తంగా ఇది 8వ సారి కావడం గమనార్హం. మరే బ్యాటర్ కూడా ఇన్నిసార్లు ఒకే బౌలర్ చేతిలో క్రీజును వదలలేదు.
ఒక్కటనీ చెప్పలేను చాలానే ఉన్నాయి - ఈ మ్యాచ్‌లో ఓటమి చెందడంపై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ స్పందించాడు. మేము భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోయాం. టీ20లలో భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. మా ఓటమికి కారణం ఒక్కటనీ నేను చెప్పలేను. చాలానే ఉన్నాయి. మా బౌలర్లు బాగానే రాణించారు. అనుకున్న ఫలితం సాధించేందుకు మా వంతు కృషి చేశాం. ఏదేమైనా చివరి వరకు పోరాడుతూనే ఉండాలని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూనే ఉంటాను. క్లిష్ట పరిస్థితులను ఎదురవ్వడం సహజమే. ఛాలెంజెస్ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తేనే మనల్ని మనం మరింత మెరుగుపరచుకోగలం.’’ అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ పోరులో హార్దిక్ పాండ్య రెండు వికెట్లు(2/44) తీశాడు. బ్యాటర్‌గా మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబయిని వారి సొంతగడ్డపైనే ఓడించింది. ఆ జట్టులో సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును వెంకటేశ్ అయ్యర్(52 బంతుల్లో 70 పరుగులు) అందుకున్నాడు.
జట్టు ప్రకటించిన యూఎస్ఏ - ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లకు చోటు - T20 World cup 2024
ముంబయిపై కోల్‌కతా విజయం - 12ఏళ్ల తర్వాత తొలిసారి! - IPL 2024