IPL 2024 Kolkata Knight Riders vs Delhi Capitals : ఐపీఎల్-2024లో భాగంగా తాజాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. దిల్లీ క్యాపిటల్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ముగించేసింది. ఫిలిప్ సాల్ట్(33 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్స్‌ల సాయంతో 68 పరుగులు) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. సునీల్ నరైన్(10 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 15 పరుగులు), రింకూ సింగ్(11 బంతుల్లో 11 పరుగులు) స్కోర్ చేశారు. శ్రేయస్ అయ్యర్(23 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 33 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్(23 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 26 నాటౌట్) స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అక్సర్ పటేల్ 2 , లిజాద్ విలియన్స్ ఓ వికెట్ తీశారు.
-
𝘒𝘢𝘳 𝘥𝘪 𝘮𝘢𝘯𝘮𝘢𝘢𝘯𝘪 🕊️ pic.twitter.com/mGJYiKoxUN
— KolkataKnightRiders (@KKRiders) April 29, 2024
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో దిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయలేదు.నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది దిల్లీ. కేకేఆర్ బౌలర్ల దెబ్బకు దిల్లీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివర్లో స్పిన్నర్ కుల్దీప్ మాత్రం కాస్త కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 35 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో దిల్లీ 150 ప్లస్ మార్క్‌ను దాటింది. అలానే కెప్టెన్ రిషబ్ పంత్ 27 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో అదరగొట్టాడు. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. వీరితో పాటు స్టార్క్, నరైన్ తలో వికెట్ తీశారు. అయితే కేకేఆర్ బౌలర్లు ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది..
టీమ్ఇండియాకు కొత్త వైస్ కెప్టెన్ అతడేనా? - T20 WORLD CUP 2024
టీమ్ఇండియా వికెట్ కీపర్‌గా ఫస్ట్ ఛాయిస్ అతడే! - T20 World cup 2024