ETV Bharat / sports

శ్రేయస్ క్రష్ ఆ అమ్మాయే - సీక్రెల్ రివీల్ చేసిన కేకేఆర్ కెప్టెన్ - Shreyas Iyer Crush - SHREYAS IYER CRUSH

IPL 2024 KKR Captain Shreyas Iyer Crush : కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్​ తన క్రష్ గురించి చెప్పాడు. ఆ అమ్మాయి కోసం చాలా ఎదురుచూసినట్లు చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాలు స్టోరీలో.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 5:14 PM IST

IPL 2024 KKR Captain Shreyas Iyer Crush : టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్​ కఫిల్ శర్మ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందులో వీరిద్దరు కలిసి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. అలాగే నవ్వులు కూడా పూయించారు. వీరు చెప్పిన విషయాలు రెండు రోజుల నుంచి వరుసగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అలా తాజాగా శ్రేయస్ అయ్యర్ తన క్రష్ గురించి చెప్పిన విషయం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్​గా మారింది.

స్టేడియంలో మహిళా అభిమానులపై కెమెరా మెన్‌లు ఫోకస్‌ చేసే విషయం గురించి ఈ షోలో ప్రస్తావన వచ్చింది. అప్పుడు శ్రేయస్‌ అందుకుని తన తొలి ఐపీఎల్ సీజన్​లో ఓ అందమైన అమ్మాయిని చూసి తాను ఫ్లాట్ అయిపోయినట్లు తెలిపాడు. "నా మొదటి ఐపీఎల్‌ సీజన్‌లో ఓ అందమైన అమ్మాయిని చూశాను. స్టాండ్స్‌లో కూర్చున్న ఆ అమ్మాయిని చేయి ఊపాను. హలో చెప్పాను. అప్పుడు ఫేస్‌బుక్‌ కూడా చాలా ఫేమస్. అందులో ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేస్తుందని చాలా ఎదురుచూశాను." అంటూ శ్రేయస్‌ తన తొలి క్రష్‌ గురించి బయటకు చెప్పాడు.

ఇక శ్రేయస్‌ ఈ విషయం చెప్పగానే షోలో ఉన్నవారంతా హడావుడి చేశారు. ఓ అంటూ అరుపులు చేస్తూ హంగామా చేశారు. ఇంకా ఈ షోలో శ్రేయస్ మరిన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నాడు. తన ఆరాధ్య క్రికెటర్‌ రోహిత్‌ శర్మ అని చెప్పాడు. అతడు భారత జట్టు కెప్టెన్‌ అయినందు వల్ల ఈ మాట చెప్పడం​ లేదని కూడా వివరించాడు. సహచరులతో రోహిత్‌ చాలా నాటుగా మాట్లాడతాడని కూడా చెప్పాడు. అప్పుడు రోహిత్‌ కూడా శ్రేయస్‌పై ఇదే విషయాన్ని చెప్పాడు.

కాగా, రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్​ ప్రస్తుతం ఐపీఎల్‌ 2024లో ఆడుతూ బిజీగా ఉన్నారు. రోహిత్‌ కెప్టెన్సీ వదిలేసి ముంబయి జట్టులో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ టీమ్​ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క​ మ్యాచులో గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక శ్రేయస్‌ నాయకత్వంలోని కేకేఆర్‌ 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచి పాయింట్స్ టేబుల్​లో రెండో స్థానంలో నిలిచింది.

'అప్పుడేమో వెన్నుపోటు పొడిచి​ ఇప్పుడు ప్రశంసిస్తున్నావా'​ - IPL 2024 RCB Dinesh Karthik

ఇకపై జడ్డూను అలానే పిలవాలట - చెన్నై ఫ్రాంచైజీ అఫీషియల్ అనౌన్స్​మెంట్​! - Ravindra Jadeja New Name

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.