IPL 2024 CSK VS RCB Play Offs : ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేసులో నాలుగో బెర్త్ ఉత్కంఠకు తెరపడింది. తాజాగా జరిగిన కీలక పోరులో అదరగొట్టిన ఆర్సీబీ సీఎస్కేపై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ ఉత్కంఠ పోరులో 28 పరుగులు తేడాతో గెలుపొందింది. 14 పాయింట్లు, +0.459 నెట్ రన్ రేట్‌తో నాకౌట్ దశకు చేరుకుంది. కీలక సమయంలో త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో ఓటమి పాలైన సీఎస్కే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర(37 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్‌ల సాయంతో 61 పరుగులు) హాఫ్ సెంచరీ బాదాడు. అజింక్యా రహానే(22 బంతులో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 33 పరుగులు), డారిల్ మిచెల్(4), శివమ్ దూబె(7), మిచెల్ శాంటర్న్(3) పరుగులు చేశారు. చివర్లో వచ్చిన రవీంద్ర జడేజా(44 నాటౌట్), ధోనీ(13 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 25) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. యశ్ దయాల్ రెండు వికెట్లు తీయగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్, కెమరూన్ గ్రీన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో బ్యాటర్లు చెలరేగారు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు సాధించారు. బ్యాటర్లలో ఫాప్ డుప్లెసిస్(39 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్‌ల సాయంతో 54 పరుగులు) అర్ధ శతకంతో మెరవగా విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్‌ల సాయంతో 47 పరుగులు), రజిత్ పాటిదార్(23 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్స్‌లతో 41 పరుగులు), కామెరాన్ గ్రీన్(17 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్‌ల సాయంతో 38 నాటౌట్) అదిరే ఇన్నింగ్స్‌లు ఆడారు. కార్తిక్(14), మ్యాక్స్‌వెల్(16) రన్స్ చేశారు. సీఎస్కే బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టగా, తుషార్ దేశ్‌పాండే, శాంట్నర్ తలో వికెట్ తీశారు.
'రోహిత్ చెప్పింది కరెక్ట్ - అతడి మాటలను నేను ఏకీభవిస్తున్నాను' - Kohli T20 World Cup
ధోనీ రిటైర్మెంట్పై కోహ్లీ కీలక కామెంట్స్ - ఇప్పుడందరూ దీని గురించే చర్చంతా! - IPL 2024 Dhoni Kohli