ETV Bharat / sports

వైజాగ్​ మ్యాచ్​ - సీఎస్కేపై దిల్లీ క్యాపిటల్స్​ విజయం - IPL 2024 CSK VS DC

IPL 2024 CSK VS DC : ఐపీఎల్ 17వ సీజన్​లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో దిల్లీ విజయం సాధించింది.

వైజాగ్​ మ్యాచ్​ -  సీఎస్కేపై దిల్లీ క్యాపిటల్స్​ విజయం

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 11:02 PM IST

Updated : Apr 1, 2024, 6:09 AM IST

IPL 2024 CSK VS DC : ఐపీఎల్ 17వ సీజన్​లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ బోణీ కొట్టింది. వరుసగా రెండు ఓటముల నుంచి పుంజుకుని చెన్నైసూపర్​ కింగ్స్​పై 20 పరుగులు తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 52), రిషభ్ పంత్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా పృథ్వీ షా(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 43) మెరుపులు మెరిపించాడు. చెన్నై బౌలర్లలో మతీషా పతిరణ మూడు వికెట్లు తీయగా ముస్తాఫిజుర్ రెహ్మాన్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.

ఛేదనలో ముకేశ్‌ కుమార్‌ (3/21), ఖలీల్‌ అహ్మద్‌ (2/21) దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్​ 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులే చేయగలిగింది. రహానె (30 బంతుల్లో 5×4, 2×6 సాయంతో 45) పోరాడాడు. ధోనీ (16 బంతుల్లో 4×4, 3×6 సాయంతో 37 నాటౌట్‌) అభిమానులను అలరించాడు.

ధోనీ రికార్డ్(IPL 2024 CSK VS DC Dhoni)​ - చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే 300 వికెట్లలో పాలు పంచుకున్న తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ ఘనతను అందుకున్నాడు. దిల్లీ క్యాపిటల్స్ డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా ఇచ్చిన క్యాచ్‌‌తో 300 ఔట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో మరే వికెట్ కీపర్ కూడా ధోనీకి దరిదాపుల్లో కూడా లేరు. ఈ జాబితాలో 300 డిసిమిసల్స్‌తో ధోనీ అగ్రస్థానంలో ఉండగా కమ్రాన్ అక్మల్(274), దినేశ్ కార్తీక్(274) రెండో స్థానంలో కొనసాగుతున్నారు. క్వింటన్ డికాక్(270), జోస్ బట్లర్(209) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ధోనీ, రోహిత్​, కోహ్లీ కాదు- ఐపీఎల్‌లో ఎక్కువ రెమ్యునరేషన్​ అందుకున్న ఇండియన్​ ప్లేయర్​ అతడే! - Highest Paid IPL Indian Player 2024

ఏడాదికి రూ.7కోట్లపైనే- చెన్నై కొత్త కెప్టెన్ రుతురాజ్​ నెట్‌వర్త్ ఎంతో తెలుసా? - Ruturaj Gaikwad Net Worth

Last Updated : Apr 1, 2024, 6:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.