ETV Bharat / sports

ఒలింపిక్స్​లో ప్రవాస భారతీయులు - ఏయే క్రీడల్లో ఉన్నారంటే? - Paris Olympics 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 10:21 AM IST

Indian origin in Paris Olympics 2024 : మరి కొద్ది రోజుల్లో పారిస్ ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. అయితే భారత సంతతికి చెందిన పలువురు క్రీడాకారులు ఈ పారిస్ ఒలింపిక్స్​లో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ వారు ఎవరు? స్వరాష్ట్రం ఏది? ఏ క్రీడలో పాల్గొంటున్నారు? తదితర వివరాలు చూద్దాం.

Indian origin in Paris Olympics 2024
Indian origin in Paris Olympics 2024 (Associated Press)

Indian origin in Paris Olympics 2024 : ప్రతి క్రీడాకారుడు తన జీవితం ఒక్కసారైనా ఒలింపిక్స్​లో పోటీపడాలని, దేశానికి పతకాన్ని అందించాలని ఆశపడుతుంటాడు. ఈ విశ్వ క్రీడల్లో పాల్గొనాలంటే కొన్ని దేశాల్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. అయితే కొందరు తల్లిదండ్రుల వృత్తిరీత్యా స్వదేశాన్ని వీడి వేరే దేశంలో స్థిరపడతారు. వారి పిల్లలు క్రీడలను కెరీర్​గా ఎంచుకొని ఒలింపిక్స్‌ స్థాయికి వెళ్తుంటారు. మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఈ పారిస్‌ ఒలింపిక్స్​లో భారత ములాలు ఉండి, వేరే దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులెవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రాజీవ్ రామ్ (టెన్నిస్)
రాజీవ్‌ రామ్‌ తల్లిదండ్రులు రాఘవ్, సుష్మా బెంగళూరు నుంచి చాలా ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. రాజీవ్ రామ్ తల్లిదండ్రులు సైన్స్ రంగంలో ఉంటే అతడు మాత్రం టెన్నిస్​ను ఎంచుకున్నాడు. 2019లో రాజీవ్ తండ్రి రాఘవ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్​తో మరణించారు. 2016 రియో ఒలింపిక్స్​లో వీనస్‌ విలియమ్స్‌ జతగా అతడు మిక్స్‌డ్‌ డబుల్స్​లో స్వర్ణం గెలిచాడు. మొత్తం ఐదు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నాడు. పారిస్​లో జరిగే ఒలింపిక్స్​లో రామ్‌ అమెరికా తరఫున పురుషుల డబుల్స్​లో పోటీపడనున్నాడు.

శాంతి పెరీరా (అథ్లెటిక్స్‌)
శాంతి పెరీరా స్వస్థలం కేరళ. ఆమె పూర్వీకులు తిరువనంతపురం నుంచి సింగపూర్​కు వలస వెళ్లిపోయారు. సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ అమ్మాయి 100 మీటర్ల పరుగులో బరిలో ఉంది. ఆసియా క్రీడల్లో రజతం గెలిచి 49 ఏళ్ల సింగపూర్‌ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.

ప్రీతిక పావడే (టేబుల్ టెన్నిస్)
ఫ్రాన్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ బృందంలో ఉన్న ప్రీతిక పావడే తండ్రి స్వస్థలం పుదుచ్చేరి. 2003లో పెళ్లి చేసుకుని పుదుచ్చేరి నుంచి ప్రీతిక తండ్రి ఫ్రాన్స్​కు వలసవెళ్లిపోయాడు. ఫ్రాన్స్ రాజధాని పారిస్​లో ప్రీతిక 2004లో జన్మించింది. తండ్రి కూడా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కావడం వల్ల ప్రీతికకు కూడా ఈ ఆటపై ఇష్టం ఏర్పడింది. 16 ఏళ్ల వయసులో టోక్యో ఒలింపిక్స్​లో పోటీపడిన ప్రీతిక, ఇప్పుడు పారిస్‌లో మహిళల డబుల్స్, మిక్స్​డ్‌ ఈవెంట్లలో బరిలోకి దిగనుంది.

అమర్‌ దేశి (రెజ్లర్)
రెజ్లర్‌ అమర్‌ దేశి కుటుంబం పంజాబ్‌ నుంచి కెనడాకు వలస వెళ్లింది. అమర్‌ తండ్రి బల్బీర్‌ పంజాబ్‌ పోలీస్‌ విభాగంలో కొన్నాళ్లపాటు పని చేశారు. 1979లోనే కెనడాకు కుటుంబంతో కలిసి వలస వెళ్లారు. అక్కడ ఓ రెజ్లింగ్‌ క్లబ్​ను స్థాపించారు. ఈ క్రమంలోనే అమర్​కు కూడా కుస్తీపై ఆసక్తి కలిగింది. యోగేశ్వర్ దత్​​ను ఆరాధించే ఈ కుర్రాడు టోక్యోలో 125 కేజీల విభాగంలో పోటీపడినా పతకం సాధించలేకపోయాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో ఇదే విభాగంలో పసిడి సాధించిన అమర్‌, ఈసారి పారిస్‌ లోనూ పతకం పట్టాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.

కనక్‌ ఝా (టేబుల్‌ టెన్నిస్‌)
అమెరికా టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ కనక్‌ ఝా తండ్రి ప్రయాగ్‌ రాజ్‌ స్వస్థలం కోల్‌కతా, తల్లి కరుణ స్వస్థలం ముంబయి. వీరు కొన్నాళ్ల క్రితం అమెరికాకు వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలో భారత నివాస సముదాయాల్లో ఉండటం వల్ల టేబుల్ టెన్నిపై కనక్​కు ఆసక్తి ఏర్పడింది. సోదరి శిక్షణలో టీటీపై పట్టు సాధించాడు. నాలుగుసార్లు (2016, 17, 18, 19) యూఎస్‌ జాతీయ టీటీ ఛాంపియన్​గా నిలిచాడు. ప్రస్తుతం పారిస్‌ ఒలింపిక్స్​లో టేబుల్ టెన్నిస్ సింగిల్స్​లో పోటీపడుతున్నాడు.

పారిస్ ఒలింపిక్స్​కు ఏఐ నిఘా - ప్రైవసీపై వెల్లువెత్తుతున్న ఆందోళనలు - Paris Olympics 2024

రెండేళ్లలో ఎన్నో మార్పులు - పారిస్​ బరిలో సత్తా చాటనున్న యంగ్ ఛాంపియన్స్ - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.