India Vs Sri Lanka 3rd ODI : 27 ఏళ్లుగా శ్రీలంకతో వన్డే సిరీస్‌ను కోల్పోని రికార్డు భారత్‌కు ఉంది. అయినా సరే ప్రస్తుతం లంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ఇండియా 1-0తో వెనకబడింది. మొదటి వన్డే టై కాగా, రెండో వన్డేలో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిచవిచూసింది. ఈ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే టీమ్ఇండియా ఇంతలా వెనకబడటానికి కారణం ఏంటంటే?
ముందుగా టీమ్ మేనేజ్‌మెంట్‌లో మార్పు వచ్చింది. కొత్త హెడ్ కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్, అతడి టీమ్ కొత్త ఐడియాలు, స్ట్రాటజీలను ప్రవేశపెట్టారు. ఈ మార్పులు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, తక్షణ ఫలితాలను అందించలేదని విశ్లేషకుల మాట.
బలపడిన శ్రీలంక
శ్రీలంక క్రికెట్ కూడా మెరుగుపడింది. మహిళల టీ20 ఆసియా కప్ విజయం కూడా ప్రభావం చూపించింది. దేశంలో క్రికెట్ పాపులారిటీ పెరిగింది. ఈ విజయంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియంకి తరలివస్తున్నారు. పురుషుల జట్టుకు ప్రేక్షకుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.
టీమ్ ఇండియాలో సమస్యలు
బ్యాటింగ్ ఆర్డర్
నిరంతరం మారుతున్న భారత బ్యాటింగ్ ఆర్డర్ ప్రధాన ఆందోళనగా కనిపిస్తోంది. 2023 ప్రపంచ కప్ సమయంలో బ్యాటింగ్ ఆర్డర్ స్థిరంగా ఉంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ నాలుగు, ఐదో స్థానాల్లో కీలక పాత్ర పోషించారు. గంభీర్ కొత్త స్ట్రాటజీలో బ్యాటింగ్ ఆర్డర్‌లో తరచుగా మార్పులు ఉంటాయి. బ్యాటింగ్ ఆర్డర్ మారడం ఆటగాళ్ల ప్రదర్శనలను ప్రభావితం చేస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఆటగాళ్లు మెరుగ్గా రాణించేలా ఎక్కువ కాలం పాటు స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్‌ను కొనసాగించాలి.
స్పిన్ ఎదుర్కోవడంలో ఇబ్బందులు
శ్రీలంక స్పిన్ బౌలింగ్‌కు ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. శ్రీలంక యంగ్ ఆల్ రౌండర్ దునిత్ వెల్లలాగే, లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే స్పిన్‌ని ఎదుర్కోలేక వికెట్లు సమర్పించుకుంటున్నారు. రెండో వన్డేలో వాండర్సే ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. టర్నింగ్ ట్రాక్‌లలో, కొత్త స్పిన్నర్‌లను ఎదుర్కోలేక కుప్పకూలడం ప్రధాన సమస్యగా మారింది. దీన్ని అధిగమించేందుకు స్పిన్ ఆడటంలో టెక్నికల్‌గా మానసికంగా ప్లేయర్స్‌ని సిద్ధం చేయడంపై బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ ఫోకస్ చేయాలి. తాత్కాలికంగా, రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకురావడం మంచి ఫలితాలు ఇవ్వవచ్చు.
బుమ్రా లేని లోటు
స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ బ్యాటింగ్‌పై జట్టు ఎక్కువగా ఆధారపడటం గురించి చర్చ జరుగుతున్నప్పటికీ, అసలు సమస్య బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌ల అస్థిరత. ఇద్దరూ సత్తా చూపారు కానీ నిలకడగా రాణించలేకపోయారు. డెత్ ఓవర్లలో కీలక భాగస్వామ్యాలను విడగొట్టడం, పరుగులు కట్టడి చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు బౌలర్‌లకు తమను తాము నిరూపించుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వాలి లేదా ప్రత్యామ్నాయాలను పరిగణించాలి.
'రిస్క్ చేయడానికి భయపడను- ఆ విషయంలో తగ్గేదేలే' - Rohit Sharma
డెబ్యూ మ్యాచ్‌లో ఫెయిల్- వన్ ఇయర్ బ్యాన్- ఇప్పుడు ఒక్క నైట్‌లో సెన్సేషన్ - Ind vs SL Series 2024