ETV Bharat / sports

తొలి టెస్ట్​లో టీమ్ఇండియా ఓటమి​ - రానున్న మ్యాచ్​ల్లో ఈ మార్పులు ఖాయం! - INDIA VS NEW ZEALAND 2ND TEST

టీమ్ఇండియా పేలవ ఫామ్​ - రెండవ టెస్ట్​లో ఈ మార్పులు ఖాయం!

India Vs New Zealand 2nd Test
Team India (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 22, 2024, 9:34 AM IST

India Vs New Zealand 2nd Test : తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్​లో టీమ్ఇండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఎంతో శ్రమించినా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో తప్పెక్కడ జరిగిందో అని విశ్లేషించుకునే పనిలో భారత జట్టు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని రానున్న మ్యాచ్​లకు సర్దుబాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టులో కొన్ని మార్పులు తప్పకపోవచ్చని క్రికెట్ వర్గాల మాట.

జరగనునన్న మార్పులు ఇవే!
అయితే ఈ సారి హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. విదేశీ పేస్‌ పిచ్‌లపై రాణించినట్లు స్వదేశీ వికెట్లపై సత్తా చాటలేకపోతున్నందున ఈ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. సొంతగడ్డపై 13 టెస్ట్​లు ఆడిన ఈ స్టార్ క్రికెటర్ కేవలం 19 వికెట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకున్నాడు. విదేశాల్లో మాత్రం అతను 17 టెస్టుల్లోనే 61 వికెట్లు తీయడం విశేషం.

ఇటీవల భారత పిచ్‌లు కొంత పేస్‌కు అనుకూలిస్తున్నప్పటికీ సిరాజ్‌ పెద్దగా రాణించలేకపోతున్నాడు. కివీస్‌తో తొలి టెస్టులో అతను కేవలం 2 వికెట్లే తీశాడు. అయితే అనుభవం దృష్ట్యా సిరాజ్​నే సెలక్టర్లు ఎంపిక చేసుకుంటున్నప్పటికీ, ఫామ్‌ ప్రకారం చూస్తే యంగ్ ప్లేయర్ ఆకాశ్‌దీప్‌కు ఈ ఛాన్స్‌ ఇవ్వాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆడిన మూడు టెస్టుల్లో ఆకాశ్‌ 23.12 సగటుతో 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూడు మ్యాచ్‌లూ స్వదేశంలో ఆడినవే కావడం విశేషం.

ఇదిలా ఉండగా, పుణె మ్యాచ్​లో ఇద్దరు పేసర్లకే స్థానం ఇవ్వలనుకుంటే అప్పుడు బుమ్రాకు తోడుగా సిరాజ్‌ స్థానంలో ఆకాశ్‌ను ఆడించాలనేదే అభిమానుల వాదన. జట్టు యాజమాన్యం కూడా ఈ విషయంలో సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు బ్యాటింగ్‌ లైనప్​లోనూ మార్పులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మెడ నొప్పితో తొలి టెస్టుకు దూరమైన యంగ్ క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్‌, నెమ్మదిగా కోలుకుని రెండో టెస్టుకు అందుబాటులోకి వస్తున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతడికి తుది జట్టులో చోటివ్వాల్సిందేనని విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇప్పుడు శుభ్‌మన్​ను తీసుకునేందుకు తొలి టెస్ట్​లో అద్భుత శతకం (150) సాధించిన సర్ఫరాజ్‌ ఖాన్‌ను వదులుకునే పరిస్థితి ఎంతమాత్రం లేదని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, బెంగళూరులో పేలవ ఫామ్​ కనబరిచిన స్టార్ క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే పుణె సిరీస్​ కోసం రాహుల్‌కు సెలక్టర్లు మరో అవకాశమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి టెస్టులో మోకాలి గాయం వల్ల రోజున్నర పాటు ఆటకు దూరంగా ఉన్న రిషబ్‌ పంత్, ఆ తర్వాత కష్టపడి బ్యాటింగ్‌ అయితే చేశాడు. అయితే ఆ నొప్పి మాత్రం తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీంతో రెండో టెస్టుకు అతడ్ని దూరం పెట్టే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో పంత్‌ ఆడకపోతే మాత్రం అతడి స్థానంలో శుభ్‌మన్‌ జట్టులోకి రావడం, రాహుల్, సర్ఫరాజ్‌ కొనసాగడం ఖాయమని అంటున్నారు. అయితే పంత్‌ ఆడేందుకు వస్తే మాత్రం కేఎల్ రాహుల్‌పై వేటు పడొచ్చని విశ్లేశకుల మాట.

తొలి సెంచరీతోనే అరుదైన క్లబ్​లో సర్ఫరాజ్- దిగ్గజాల సరసన చోటు

పంత్ రెండో టెస్ట్ ఆడుతాడా? - అతడి గాయంపై మాట్లాడిన రోహిత్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.