India vs England Test Series Rohit Sharma : టీమ్ఇండియా - ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ తొలి రోజు ఆటలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ అభిమాని వచ్చి కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్లు మొక్కాడు.
వివరాల్లోకి వెళితే. హైదరాబాద్ వేదికగా భారత్ - ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు ఒక ఊహించని సంఘటన ఎదురైంది. రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు దిగిన సమయంలో ప్రేక్షకుల నుంచి ఓ అభిమాని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. నేరుగా అతడు హిట్ మ్యాన్ వద్దకు దూసుకొచ్చి రోహిత్ కాళ్ల మీదపడ్డాడు. దీంతో రోహిత్ అతడిని పైకి లేపి బయటికి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. అప్పటికే సెక్యూరిటీ అక్కడికి చేరుకుని సదరు అభిమానిని మైదానం బయటికి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే రోహిత్ శర్మ కాళ్లు మొక్కింది విరాట్ కోహ్లీ అభిమానిగా తెలుస్తోంది. ఎందుకంటే రోహిత్ కాళ్లు మొక్కిన ఆ అభిమాని విరాట్ పేరుతో 18వ నంబర్ ఉన్న జెర్సీని ధరించి వచ్చాడు.
-
A fan touched Rohit Sharma's feet and hugged him.😊
— The Cricket TV (@thecrickettvX) January 25, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
- The Hitman, an emotion. ⭐#INDvENG #RohitSharma #INDvsENG pic.twitter.com/HjgfvwkbVP
">A fan touched Rohit Sharma's feet and hugged him.😊
— The Cricket TV (@thecrickettvX) January 25, 2024
- The Hitman, an emotion. ⭐#INDvENG #RohitSharma #INDvsENG pic.twitter.com/HjgfvwkbVPA fan touched Rohit Sharma's feet and hugged him.😊
— The Cricket TV (@thecrickettvX) January 25, 2024
- The Hitman, an emotion. ⭐#INDvENG #RohitSharma #INDvsENG pic.twitter.com/HjgfvwkbVP
కోహ్లీ పేరుతో మార్మోగిపోయింది : కాగా, టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అతడు ఆడకపోయినా అతడి నామస్మరణతో ఉప్పల్ స్టేడియం మార్మోగిపోయింది. తమ ఆరాధ్య క్రికెటర్‌ను స్మరించుకుంటూ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కేరింతలు కొడుతూ మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా యువత అరుపులతో స్టేడియం దద్దరిల్లిపోయింది. కొంతమంది విరాట్ ఫోటోలను పట్టుకుని ఫుల్ ఎంజాయ్ చేశారు.
తొలి రోజు మ్యాచ్ సాగిందిలా : ఇకపోతే నేడు జరిగిన ఈ మొదటి రోజు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు ఆట ముగిసే సమయానికి తన మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోయి 23 ఓవర్లలో 119 పరుగులు సాధించింది.