ETV Bharat / sports

బంగ్లాతో టెస్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ -7 వికెట్ల తేడాతో రోహిత్ సేన ఘన విజయం - India Vs Bangladesh Test

author img

By ETV Bharat Sports Team

Published : 3 hours ago

India Vs Bangladesh Test : బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. 95 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమ్‌ఇండియా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.

India  Vs Bangladesh
India Vs Bangladesh (Associated Press)

India Vs Bangladesh Test : బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. కాన్పూర్‌ వేదికగా తాజాగా జరిగిన రెండో టెస్టులోనూ టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. 95 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన రోహిత్ సేన 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.

మ్యాచ్ సాగిందిలా :
తొలి రోజు కేవలం 35 ఓవర్లే పడగా, వర్షం కారణంగా మ్యాచ్ రెండు రోజుల పాటు రద్దయ్యింది. దీంతో ఫలితం ఎటువైవు వస్తుందో అన్న తరుణంలో బంగ్లాను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆలౌట్‌ చేసి రోహిత్ సేన చెలరేగిపోయింది. దీంతో కేవలం 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి సిరీస్​ను కైవసం చేసుకుంది.

ఓపెనర్ కమ్​ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ (8), ఇక రెండో ఓపెనర్ శుభ్​మన్ గిల్ (6) విఫలమైనప్పటికీ, ఆ తర్వాత బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్ (51), విరాట్ కోహ్లీ (29*) అద్భుతంగా రాణించారు. అయితే మరో మూడు పరుగులు అవసరం అన్న సమయంలో, యశస్వి జైస్వాల్ భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత రిషభ్‌ పంత్‌తో (4*) కలిసి కోహ్లీ మరో వికెట్‌ కూడా పడనీయకుండానే జట్టును గెలిపించారు.

అంతకుముందు జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 146 పరుగులకే ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులు చేయగా, అందులో భారత్ 285/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.

ఇక ఈ విజయంతో స్వదేశంలో వరుసగా 18వ సిరీస్‌ను భారత్‌ గెలిచినట్లు అయింది. యశస్వి జైస్వాల్ ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా, రవిచంద్రన్ అశ్విన్‌ 'ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ సిరీస్‌ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న టీమ్‌ఇండియా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. రాబోయే ఎనిమిది టెస్టుల్లో మరో మూడు గెలిచినా భారత్‌ టాప్‌-2లో ఉండి ఫైనల్‌కు చేరడం ఖాయం.

ఆకాశ్ దీప్ కళ్లుచెదిరే సిక్స్​లు - అది విరాట్ ఇచ్చిన బ్యాటేనా? - Akash Deep Sixes

జడేజా 'ట్రిపుల్ సెంచరీ' - టీమ్ఇండియా ఆల్​రౌండర్​ ​ రేర్​ రికార్డ్ - Ravindra Jadeja 300 Wickets

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.