Ind vs Ban 2nd Test : భారత్ - బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు తొలి రోజు 35 ఓవర్లకే ఆట ముగిసింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించడం వల్ల మిగిలిన ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఆట రద్దయ్యే సమయానికి బంగ్లా 107/3 (35 ఓవర్లు) స్కోర్‌తో ఉంది. క్రీజులో మొమినుల్ హక్ (40 పరుగులు), ముష్పికర్ రహీమ్ (6 పరుగులు) ఉన్నారు. తొలి రోజు ఆటలో ఆకాశ్ దీప్ 2, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.
అయితే కాన్పూర్‌లో గురువారం రాత్రి నుంచే వర్షం కురుస్తోంది. దీంతో మైదానం చిత్తడిగా మారింది. అందుకే ఉదయం 9 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా, గంట సేపు ఆలస్యం అయ్యింది. ఇక మ్యాచ్ 10.30 గంటలకు ప్రారంభమైంది. 8.3 ఓవర్ వద్ద ఓపెనర్ జకీర్ హసన్‌ను పేసర్ ఆకాశ్ దీప్ డకౌట్ చేశాడు. ఆకాశ్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన జకీర్ స్లిప్‌లో యశస్వీ జైస్వాల్‌కు చిక్కాడు.
కాసేపటికే మరో ఓపెనర్ షద్మన్ ఇస్లామ్ (24 పరుగులు)ను కూడా ఆకాశ్ పెవిలియన్ పంపాడు. అతడిని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఈ దశలో మొమినుల్ హక్, నజ్ముల్ షాంటో (31 పరుగులు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అలా నిలకడగా సాగుతున్న ఇన్నింగ్స్‌లో అశ్విన్ షాంటోను వెనక్కి పంపి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు.
UPDATE 🚨
— BCCI (@BCCI) September 27, 2024
Due to incessant rains, play on Day 1 has been called off in Kanpur.
Scorecard - https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/HSctfZChvp
భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
బంగ్లాదేశ్ జట్టు : షద్మాన్ ఇస్లామ్, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్
కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్ - తొలి భారత బౌలర్‌గా ఘనత - Ashwin Records