IND VS Srilanka T20 Series Hardik Pandya Captain : టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన వెంటనే ఈ నిర్ణయం ప్రకటించాడు. దీంతో టీ20ల్లో భారత కెప్టెన్ ఎవరనే ప్రశ్న మొదలైంది. ప్రస్తుత జింబాబ్వే సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ తాత్కాలిక కెప్టెన్‌గా మాత్రమే వ్యవహరిస్తున్నాడు. టీ20లకు పూర్తి స్థాయి కెప్టెన్‌ను బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు.
అయితే టీ20లకు రోహిత్ శర్మ తర్వాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు వికెట్‌కీపర్- బ్యాటర్ కేఎల్ రాహుల్ వన్డే పగ్గాలు అందుకోవచ్చని సమాచారం. బీసీసీఐ వర్గాలు వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ, ‘హార్దిక్ పాండ్యా T20లో భారత జట్టుకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రీలంకతో జరగబోయే సిరీస్‌లో హార్దిక్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం లేదు’ అని తెలిపాయి.
- వరల్డ్ కప్‌లో సత్తా చాటిన హార్దిక్
2024 ఐపీఎల్‌లో రోహిత్ నుంచి పాండ్య కెప్టెన్సీ అందుకున్నాక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో కెప్టెన్సీ, ఆల్ రౌండర్‌గా కూడా విఫలమయ్యాడు. అయితే పాండ్య త్వరగానే ఫామ్ అందుకున్నాడు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో రాణించాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 48.00 యావరేజ్, 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. బౌలింగ్‌లో కూడా పాండ్య అదరగొట్టాడు. 8 మ్యాచుల్లో 17.36 యావరేజ్, 7.64 ఎకానమీ రేటుతో 11 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో అతడి అత్యుత్తమ గణాంకాలు 3/20 కావడం గమనార్హం. పాండ్య గుజరాత్ టైటెన్స్ కెప్టెన్‌గా సక్సెస్ అయ్యాడు. అతడి కెప్టెన్సీలో గుజరాత్ రెండు ఐపీఎల్ ఫైనల్స్ ఆడింది. ఓ సారి కప్పు గెలిచింది. - వన్డేలకు అతనే రోహిత్ వారసుడు?
భారత్‌లో జరిగిన 2023 వన్డే ప్రపంచ కప్‌లో కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేశాడు. 9 ఇన్నింగ్స్‌లలో 77.20 యావరేజ్, 98.72 స్ట్రైక్ రేట్‌తో 386 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయినా వివిధ సమీకరణాలతో కేఎల్ రాహుల్, టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక కాలేదు. బీసీసీఐ వర్గాల మేరకు, ‘రోహిత్ శర్మ అందుబాటులో లేనప్పుడు రాహుల్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. అతను సుదీర్ఘ ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తాడని బోర్డు విశ్వసిస్తుంది’ అని పేర్కొన్నాయి. రోహిత్ మరి కొంత కాలం వన్డే, టెస్టుల్లో కొనసాగే ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి రాహుల్‌ను అప్పుడే వన్డే కెప్టెన్‌గా చూసే అవకాశాలు లేవు.
మూడో టీ20లో టీమ్ఇండియా విజయం - డియాన్ మైయర్స్ పోరాటం వృథా