Kho Kho World Cup : ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Kho Kho Federation Of India) చరిత్రలోనే మొట్టమొదటి వరల్డ్ కప్ నిర్వహించనుంది. 2025లో భారత్ వేదికగానే ఖో ఖో వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి. అంతర్జాతీయ ఖో ఖో ఫెడరేషన్తో కలిసి భారత ఫెడరేషన్ ఈ వరల్డ్‌కప్ నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ టోర్నీలో 24 దేశాలు పాల్గొననున్నాయి. మొత్తం 16 పురుష, మహిళా జట్లు పోటీల్లో తలపడే అవకాశం ఉంది. 2032 ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యమని ఖో ఖో ఇండియా ప్రకటన చేసింది.
'భారత్‌లో తొలి ప్రపంచకప్ నిర్వహించేందుకు మేం సంతోషిస్తున్నాం. ఈ వరల్డ్‌కప్ కేవలం పోటీల కోసమే కాదు. ప్రపంచంలోని వివిధ దేశాలను ఒక్కతాటిపైకి తెచ్చి, ఈ క్రీడకు విశ్వవ్యాప్తంగా క్రేజ్ తీసుకురావడమే మా లక్ష్యం. 2023 ఒలింపిక్స్‌లో ఖో ఖో ఆటను చూడడం మా కల. ఆ కల సాకారం చేసుకోవడానికి ఈ వరల్డ్‌కప్ నిర్వహణ తొలి అడుగు' అని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సుదాంశూ మిత్తల్ (Sudhanshu Mittal) పేర్కొన్నారు.
50 లక్షల టార్గెట్
అయితే ప్రపంచకప్‌కు ముందు ఈ ఆటను మరింత ఎక్కువ మందికి చేరేలా ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రణాళిక రచిస్తోంది. దాదాపు 10 నగరాల్లో 200 పాఠశాలలల్లో ఖో ఖో గేమ్‌ను ప్రమోట్ చేయాడానికి ప్లాన్ చేస్తోంది. వరల్డ్‌కప్ పోటీలకు ముందు ఓ స్పెషల్ డ్రైవ్‌తో దేశంలో కనీసం 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
ఖో ఖో క్రీడకు సంబంధించి దాని మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. భారత్‌లో ఈ ఆటకు సూపర్ క్రేజ్ ఉంది. ఇక్కడ ఈ గేమ్ ఆడే అథ్లెట్లు కూడా ఎక్కువే. భారత సంస్కృతిక క్రీడ అయినటువంటి ఖో ఖో ఇప్పుడు సరిహద్దులు దాటి వివిధ దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం ఖో ఖో ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో ఆడుతున్నారు.
ఖోఖో కూత... ఐపీఎల్ తరహాలో లీగ్
ఒలింపిక్స్‌లో కొత్త క్రీడలకు భారత్ ప్రపోజల్!- లిస్ట్‌లో కబడ్డీ, ఖోఖో - 2036 Olympic Games