ETV Bharat / sports

'ఇండియా' రెడీ మీరు రెడీనా?- T20 వరల్డ్​కప్ ప్రోమో వీడియో - 2024 T20 World Cup - 2024 T20 WORLD CUP

India T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్ సమీపిస్తున్న తరుణంలో స్టార్ స్పోర్ట్స్ టీమ్ఇండియా కోసం స్పెషల్ ప్రోమో వీడియో రిలీజ్ చేసింది. మరి మీరు ఈ వీడియో చూశారా?

India T20 World Cup
India T20 World Cup
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 9:38 AM IST

Updated : Apr 23, 2024, 11:46 AM IST

India T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్​ మరో 40 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాడ్​కాస్టింగ్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ తాజాగా టీమ్ఇండియా కోసం స్పెషల్ ప్రోమో వీడియో రిలీజ్ చేసింది. 'రోహిత్ సేన టీ20 వరల్డ్​కప్​నకు సిద్ధమవుతోంది. వాళ్ల యాక్షన్ చూడడానికి మీరు సిద్ధమా?' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక వీడియో బ్యాక్​గ్రౌండ్​లో భారత జాతీయ గేయం 'వందేమాతం' లిరిక్స్ ప్లే చేశారు. ఈ లిరిక్స్ వీడియోలో హైలైట్​గా నిలిచాయి. మీరు వీడియో చూశారా?

ఇక టోర్నమెంట్ జూన్ 2న ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఆమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇప్పటికే ఐసీసీ అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరిగే నగరాల్లో పలు స్టార్ హోటళ్లను ఆయా దేశాల ఆటగాళ్ల కోసం బుక్ చేశారంట. టోర్నీలో పాల్గొనే 20 దేశాల ప్లేయర్లు, జట్టు మేనేజ్​మెంట్​లు వీసా క్లియరెన్స్ పనులు పూర్తి చేసుకున్నాయి.

ఈ పొట్టికప్​ కోసం అజిత్ ఆగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మరో వారం రోజుల్లో టీమ్ఇండియా జట్టును అనౌన్స్ చేయనుంది. ఈ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ ఎలాగో జట్టులో ఉండనున్నారు. ఇక మిగతా స్థానాల కోసం ఆయా ప్లేయర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఐపీఎల్​లో రాణిస్తున్న యువ ఆటగాళ్లకు ఈ వరల్డ్​కప్ టోర్నీలో ఛాన్స్ రానుంది.

ఈసారైనా? భారత్ గత 10 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ నెగ్గలేదు. టీమ్ఇండియా చివరిసారిగా 2013లో ఎమ్ ఎస్ ధోనీ నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిన్ సాధించింది. ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్​కప్ (2015, 2019, 2023), టీ 20 ప్రపంచకప్ (2014, 2016, 2021, 2022) టోర్నమెంట్​ల్లో విఫలమైంది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్​కప్​లోనూ ఫైనల్​ దాకా వెళ్లిన టీమ్ఇండియా టైటిల్​కు ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. ఇక ఈసారైనా టీమ్ఇండియా టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంది.

రోహిత్‌ శర్మకు జోడీగా కోహ్లీ - ఆ ప్లేయర్​కు కూడా జట్టులో ఛాన్స్​! - T20 World Cup Teamindia Squad

IPLలో రప్ఫాడిస్తున్న 'దూబే'- హార్దిక్ టీమ్ఇండియా ప్లేస్​​పై ఎఫెక్ట్? - Shivam Dube IPL 2024

Last Updated : Apr 23, 2024, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.