స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో భారత షూటర్లు మహేశ్వరి చౌహాన్, అనంత్‌జిత్ సింగ్ ద్వయం 43-44 చైనా జోడీ (జియాంగ్, జియాన్లిన్) చేతిలో పరాజయాన్ని చవిచూసింది.
క్వార్టర్స్‌కు చేరిన నిశా దహియా - రెజ్లింగ్ మహిళల ప్రిస్టైల్ 68 కేజీల విభాగంలో నిశా దహియా క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-4తో టెటియానా సోవా రిజ్కో (ఉక్రెయిన్)పై గెలుపొందింది. తొలుత 1-4తో వెనుకబడిన నిశా ఆ తర్వాత గొప్పగా పుంజుకుని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక నిశా దహియా క్వార్టర్స్‌లో ఉత్తర కొరియాకు చెందిన సోల్ గమ్‌తో తలపడనుంది.