ETV Bharat / sports

జింబాబ్వే గడ్డపై యువ భారత్- కుర్రాళ్లు సత్తా చాటేనా? - India Tour Of Zimbabwe 2024

Ind Vs Zim 1st T20 2024: శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టు జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ శనివారం ప్రారంభం కానుంది. మరి ఈ సిరీస్‌లో తమదైన ముద్ర వేసే యువ ఆటగాళ్లెవరో?

Ind Vs Zim 1st T20
Ind Vs Zim 1st T20 (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 7:03 AM IST

Ind Vs Zim 1st T20 2024: యంగ్ టీమ్ఇండియా, జింబాబ్వేతో టీ20 సిరీస్​కు రెడీ అయ్యింది. శనివారం (జులై 6)టీ20 సిరీస్​ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో యువ భారత్ 5టీ20 మ్యాచ్​లు ఆడనుంది. ఈ జట్టును యంగ్ బ్యాటర్ శుభ్​మన్​ గిల్ నడిపించనున్నాడు. గిల్​తోపాటు అభిషేక్‌ శర్మ, రుతురాజ్‌ గైక్వాడ్, సాయి సుదర్శన్, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ సిద్ధమయ్యారు. జింబాబ్వేపై వీరి ప్రదర్శన ఎలా ఉండనుందో ఆసక్తిగా మారింది.

ఛాన్స్​ అందిపుచ్చుకుంటారా? టీమ్ఇండియాకు టీ20 రెగ్యులర్ కెప్టెన్ రేస్​లో ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య ముందున్నాడు. అయితే గిల్ ఈ సిరీస్​లో కెప్టెన్​గా తనదైన ముద్ర వేస్తే, సారథిగా ఆతడి పేరునూ సెలక్టర్లు పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్​కు కూడా ఇది మంచి ఛాన్స్. ఈ సిరీస్​లో బ్యాట్​తో సత్తా చాటితే అంతర్జాతీయ టీ20 సిరీస్​ ఎంపికలో ముందు వరసలో ఉంటాడు. ఇప్పటికే ఐపీఎల్​లో చెన్నై తరఫున అదరగొట్టిన గైక్వాడ్​కు నాయకత్వ లక్షణాలు కూడా ఉండడం కాస్త కలిసొచ్చే అంశం. చూడాలి మరి ఈ యంగ్​స్టర్ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటాడో?

ఇక వరల్డ్​కప్​ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రింకూ సింగ్ కూడా ఈ సిరీస్​లో తన మార్క్ చూపేందుకు తహతహలాడుతున్నాడు. వికెట్ కీపర్​గా జితేశ్ శర్మ దాదాపు ఫిక్స్. బౌలింగ్ విభాగంలో వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకోనుండగా, అవేష్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్, ముకేశ్‌ కుమార్‌ పేస్‌ దళాన్ని నడిపించాల్సి ఉంటుంది.

ఫస్ట్ టైమ్: గత ఐపీఎల్​లో అదరగొట్టిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ తొలిసారి టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్నారు. ఈ సిరీస్​లో రాణించి తమ మెరుపులు గాలివాటం కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. రియాన్ మిడిలార్డర్​లో వచ్చే ఛాన్స్ ఉండగా, అభిషేక్​ను ఏ స్థానంలో దించుతారోనని ఆసక్తి నెలకొంది. కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం ఖాయం. కాగా, మరో స్థానం కోసం రుతురాజ్, అభిషేక్ మధ్యలో పోటీ ఉంది. వీరిద్దరిలో ఆ ఛాన్స్ పట్టేదెవరో!

ప్రత్యర్థి బలంగానే: ఆతిథ్య జింబాబ్వే జట్టు కూడా కాస్త బలంగానే ఉంది. సికిందర్‌ రజా నాయకత్వంలో భారత్​పై సత్తా చాటాలని జింబాబ్వే భావిస్తోంది. ఎప్పటిలాగే కెప్టెన్ రజా ఆల్​రౌండర్ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఇక ముజరబాని, ఎంగరవ, మద్వీర, జాంగ్వి, మసకద్జతో పటిష్ఠంగా ఉన్న ప్రత్యర్థి జట్టు యువ భారత్​కు సవాల్ విసిరే అవకాశం ఉంది.

  • అన్ని మ్యాచ్​లకు హరారేలోని హరారే స్పోర్ట్స్​ క్లబ్ మైదానం వేదికకానుంది. అన్ని మ్యాచ్​లు భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం అవుతాయి.

జింబాబ్వేతో టీ20 సిరీస్​ - కోహ్లీ, రోహిత్​, జడేజా స్థానాన్ని భర్తీ చేసేదెవరు? - India tour of zimbabwe 2024

జింబాబ్వే వర్సెస్ టీమ్ఇండియా - గత రికార్డులు ఎలా ఉన్నాయంటే? - TeamIndia VS Zimbabwe

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.