ETV Bharat / sports

అలా చేసినందుకు యూఎస్​పై జరిమానా - 5 పరుగుల పెనాల్టీ ఏంటంటే? - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

IND VS USA T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024లో తాజాగా జరిగిన మ్యాచ్​లో యూఎస్ఏ చేసిన తప్పిదమే టీమ్​ఇండియాకు కలిసొచ్చిందా? అసలు ఈ 5 పరుగుల పెనాల్టీని యూఎస్ఏకు ఎందుకు విధించాల్సి వచ్చింది.

T20 World Cup 2024
IND VS USA T20 World Cup 2024 (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 9:08 AM IST

IND VS USA T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024లో టీమ్ఇండియా వరుసగా మూడో విజయం సాధించింది. ఓటమెరుగని ఇరు జట్లు తలపడిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఏడు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్​ను రోహిత్ సేన కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్​లో 111 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా పోరాడుతున్న టీమ్ఇండియాకు 5 పరుగులు అదనంగా కలిసొచ్చాయి. అయితే ఈ విషయంపై తొలుత గందరగోళం నెలకొన్నా తర్వాత క్లారిటీ వచ్చింది. అనుకోకుండా వచ్చిన 5పరుగులను యూఎస్ఏను ఒత్తిడిలోకి నెట్టేశాయి.

5 పరుగులు ఎలా వచ్చాయంటే ?
15 ఓవర్లు పూర్తయ్యేసరికి మిగిలిన 30 బంతుల్లో టీమ్ఇండియాకు 35 పరుగులు కావాల్సి ఉంది. కానీ, అప్పటికే మరో ఓవర్ స్టార్ట్ చేయడానికి యూఎస్ఏ బాగా ఆలస్యం చేసింది. అలా 60 సెకన్ల ఆలస్యానికి ఐదు పరుగుల పెనాల్టీకి గురైంది. ఐసీసీ గతేడాది ప్రవేశపెట్టిన కొత్త రూల్ యూఎస్ఏకు తలనొప్పి తెచ్చిపెట్టింది.

అసలు ఆ రూల్ ఏంటి:
క్రికెట్ ఎంపవర్‌మెంట్ కంపెనీ అంగీకారం తెలిపి ట్రయల్ పద్ధతిలో ఈ రూల్ ప్రవేశపెట్టింది. పురుషుల వన్డే, టీ20 క్రికెట్‌లో 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకూ దీని ట్రయల్ పూర్తయింది. ఓవర్ల మధ్యలో తీసుకునే గ్యాప్‌ను రెగ్యూలేట్ చేయడానికే ఈ పద్ధతి మొదలుపెట్టారు. ఒక ఓవర్ పూర్తయి తర్వాతి ఓవర్ బౌలింగ్ వేయడానికి 60 సెకన్ల కంటే ఎక్కువ ఆలస్యం కాకూడదు. ఒకవేళ అలా ఒకే ఇన్నింగ్స్‌లో మూడు సార్లు ఆలస్యమైతే ఆ జట్టుకు 5పరుగుల పెనాల్టీ విధిస్తారు.

దురదృష్టవశాత్తు యూఎస్ఏ ఆ పెనాల్టీకి గురైంది. 30 బంతుల్లో 35 పరుగులు కావాల్సిన సమయంలో అదనంగా వచ్చిన పరుగులతో లక్ష్యం ఇంకాస్త చేరువైంది. ఫలితంగా లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో చేధించింది టీమ్ఇండియా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సింగిల్ డిజిట్ స్కోరుతో తొలి మూడు ఓవర్లలోనే ఔట్ అయినా సూర్యకుమార్ యాదవ్ (50), శివమ్ దూబె(31) ఇన్నింగ్స్‌లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాయి. 4 ఓవర్లు బౌలింగ్ వేసి 9 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన అర్షదీప్ సింగ్‌ను 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' వరించింది.

ఈ మ్యాచ్‌తో సూపర్-8 స్టేజ్‌కు అర్హతను కన్ఫమ్ చేసుకున్న టీమ్ఇండియా గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌ను నామమాత్రంగా ఆడనుంది. జూన్ 15న కెనడా జట్టుతో ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది.

కూల్చేయనున్న రూ.250 కోట్ల స్టేడియం! - ఎందుకంటే? - T20 World Cup 2024

అప్పుడు అలా, ఇప్పుడు ఇలా- పాక్​ను దెబ్బకొట్టింది 'బుమ్రా'నే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.