Ind vs SL ODI Seires Records: శ్రీలంక పర్యటనలో టీమ్ఇండియాకు షాక్ తగిలింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 110 పరుగుల తేడాతో నెగ్గింది. 249 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 26.1 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆతిథ్య శ్రీలంక మూడు వన్డేల సిరీస్‌ను 2-0తేడాతో దక్కించుకుంది. ఈ క్రమంలో దాదాపు 27ఏళ్ల తర్వాత శ్రీలంక తొలిసారి భారత్‌పై వన్డే సిరీస్ దక్కించుకొని సంచలనం సృష్టించింది. చివరగా 1997లో శ్రీలంక 3-0తో భారత్‌పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. తాజాగా చరిత్ అసలంక నేతృత్వంలోని లంక జట్టు అలా 27ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.
ఈ సిరీస్‌లో మరికొన్ని రికార్డులు
- దునిత్ వెల్లలగె ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. వెల్లలగే బ్యాటింగ్‌లో 108 పరుగులతో రాణించగా, 7 వికెట్లతో అదరగొట్టాడు.
- ఈ సిరీస్‌లో టీమ్ఇండియా స్పిన్నర్లకు 27 వికెట్లు సమర్పించుకుంది. 3మ్యాచ్‌ల వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లో ఓ జట్టు స్పిన్నర్లు పడగొట్టిన అత్యధిక వికెట్లు ఇవే.
- భారత్‌పై వన్డేల్లో రెండుసార్లు 5+వికెట్లు తీసిన ఏకైక స్పిన్నర్‌గా దునిత్ వెల్లలగే ఘనత సాధించాడు. అతడు తాజా మ్యాచ్‌లో 5వికెట్లు కూల్చగా, 2023లోనూ 5వికెట్లు దక్కించుకున్నాడు.
- ఈ సిరీస్‌లో టీమ్ఇండియా ప్రతి మ్యాచ్‌లోనూ స్పిన్నర్లకు 9 వికెట్లు ఇచ్చుకుంది.
- ఈ సిరీస్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రోహిత్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి 157 పరుగులు చేశాడు. అందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
A day before his Debut 🧢
— BCCI (@BCCI) August 7, 2024
The moment he was told he will play next day 👌👌
Riyan gave a heartwarming speech inside the dressing room 🤗
All heart 💙 here#TeamIndia | #SLvIND | @ParagRiyan pic.twitter.com/1i8pCiUgNb - శ్రీలంకపై వన్డే సిరీస్ ఓడిన మూడో కెప్టెన్‌గా రోహిత్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. రోహిత్ కంటే ముందు 1993లో అజారుద్దిన్, 1997లో సచిన్ తెందూల్కర్ లంకతో సిరీస్ కోల్పోయారు.
కాగా, ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగియగా, తర్వాత రెండు వన్డేల్లోనూ ఆతిథ్య శ్రీలంక సత్తా చాటింది. సొంత గడ్డపై స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై అద్భుతంగా రాణించింది. ఇక ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌ను మాత్రం టీమ్ఇండియా దక్కించుకుంది. సూర్యకుమార్ నేతృత్వంలోని యువ భారత జట్టు పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
చేజారిన వన్డే సిరీస్- మూడో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి - Ind vs SL ODI Series
టీమ్ఇండియా - ఈ మూడు సమస్యలకు చెక్ పెట్టకుంటే 27 ఏళ్ల తర్వాత అదే రిపీట్! - India Vs Sri Lanka 3rd ODI