Sarfaraz khan Net worth : టీమ్ఇండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ కివీస్‌తో జరుగుతున్న తొలిటెస్టులో అదరగొట్టాడు. సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు లీడ్ అందించాడు. అయితే ముంబయికి చెందిన సర్ఫరాజ్ రంజీల్లోనూ ఇరగొట్టాడు. దేశవాళీ, ఐపీఎల్‌లోనూ స్థిరంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ నెట్‌వర్త్ ఎంత? అతడి దగ్గర ఉన్న కార్ల కలెక్షన్ పై ఓ లుక్కేద్దాం.
రంజీల్లో అదుర్స్ - సర్ఫరాజ్ ఖాన్ 1997 అక్టోబరు 22న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి ఉన్న సర్ఫరాజ్ రంజీల్లో ఆడాడు. ఐపీఎల్లో 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఎంట్రీ ఇచ్చాడు. అలాగే దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2022-23 రంజీ సీజన్లో ఏకంగా 122.75 సగటుతో 982 పరుగులు బాదాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. తాజాగా కివీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో చోటు దక్కించుకుని ఆదరగొడుతున్నాడు.
నెట్ వర్త్ ఎంతంటే? - అయితే సర్ఫరాజ్ నెట్‌వర్త్ రూ.16.6కోట్లు అని పలు వెబ్సైట్లు కథనాల్లో పేర్కొన్నాయి. ఈ సంపద బీసీసీఐ, ఐపీఎల్ కాంట్రాక్టులు, దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల ఫీజులు, ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్ షిప్‌ల ద్వారా అతడికి వచ్చింది. 2021లో ఆర్సీబీ నుంచి సర్ఫరాజ్ రూ.25లక్షలు పొందాడు. ఇలా ఐపీఎల్ ఆదాయం, ఎండార్స్‌మెంట్లు, మ్యాచ్ ఫీజులు కలిపి సర్ఫరాజ్ భారీ సంపాదనకు కారణమయ్యాయి. అయితే ముంబయిలో తన పాత ఇంటిలోనే సర్ఫరాజ్ నివాసం ఉంటున్నాడు. ఎటువంటి లగ్జరీకి పోకుండా సాదాసీదా జీవనాన్ని సాగిస్తున్నాడు. రెనో డస్టర్ ఎస్యూవీ (Renault Duster), ఆడి కారు సర్ఫరాజ్ దగ్గర ఉంది.
బ్రాండ్ వాల్యూ పెరిగే ఛాన్స్! - ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లోకి సర్ఫరాజ్ అడుగుపెట్టాడు. తాజాగా కివీస్‌తో జరుగుతున్న టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు. ఇలా స్థిరంగా రాణిస్తే సర్ఫరాజ్ ఆస్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. కాంట్రాక్టులు ద్వారా అదనంగా డబ్బులు వస్తుంటాయి.
సర్ఫరాజ్ కెరీర్ - టీమ్ఇండియా తరఫున మూడు 4 టెస్టులు ఆడిన సర్ఫరాజ్ 325 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉంది. అలాగే 50 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ 585 పరుగులు బాదాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది.
📸📸 Presenting the Sarfaraz Khan 💯 moment IN PICS
— BCCI (@BCCI) October 19, 2024
Live ▶️ https://t.co/8qhNBrrtDF#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/cDUK9a6HKU
'వద్దు బాబోయ్ వద్దు' - పంత్ ఆపేందుకు సర్ఫరాజ్ ఫన్నీ స్టంట్ - నవ్వులే నవ్వులు