ETV Bharat / sports

భారత్​ వర్సెస్ ఐర్లాండ్ - పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే? - T20 World Cup 2024

IND Vs IRE T20 World Cup 2024 : అమెరికాలోని న్యూయార్క్ వేదికగా భారత్, ఐర్లాండ్ మధ్య టీ20 పోరు మొదలు కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ వేదికైన న్యూయార్క్ పిచ్ ఎలా ఉండనుందంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 12:57 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

IND Vs IRE T20 World Cup 2024 : భారత్, ఐర్లాండ్ టీ20 పోరుకు మరికొద్ది గంటలే ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్లు తమ తొలి విజయం కోసం మైదానంలో తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. న్యూయార్క్‌ వేదికగా ఈ మ్యాచ్ నేడు ( జూన్ 5) రాత్రి 8 గంటలకు జరగనుంది. అయితే ఈ మ్యాచ్​కు వర్షం ముప్పు పొంచి ఉందని సమచారం. మ్యాచ్ వేదికైన న్యూయార్క్​లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

మరోవైపు ఉదయానికల్లా వర్షం తగ్గుముఖం పట్టి వాతావరణం మేఘావృతమై అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. మ్యాచ్ అక్కడి కాలమానం ప్రకారం​ ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. అలా చూస్తే ఈ సమయంలో వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువని సమాచారం. కాబట్టి ఈ మ్యాచ్​కు ఆ సమయంలో ఆటంకాలు తక్కువే అని అంటున్నారు.

వర్షం కారణంగా ఈ మ్యాచ్‌కు అంతరాయం కలిగితే అప్పుడు మేనేజ్​మెంట్ నిర్ణయం ప్రకారం పరిమిత ఓవర్లతోనే మ్యాచ్​ను కొనసాగిస్తారు. అయితే రిజర్వ్ డే ఆట ఉండనందున ఈ మ్యాచ్ రద్దయితే మాత్రం ఇరు జట్లు కూడా చెరో పాయింట్​ను అందుకుంటాయి. ఇది ఐర్లాండ్​కు ప్లస్‌ పాయింట్‌ అవుతుంది. అందుకే 2 పాయింట్లు సాధించాలంటే టీమ్​ఇండియా నేటి మ్యాచ్​ను కచ్చితంగా ఆడాల్సిందే.

డల్లాస్​లోనూ అదే పరిస్థితి
ఇప్పటికే ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. బార్బడోస్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో వర్షం రావడం వల్ల మ్యాచ్ మొత్తానికి రద్దయింది. అంతే కాకుండా డల్లాస్‌లో జరిగిన కొన్ని మ్యాచ్‌లకు కూడా వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఈ మ్యాచ్​కు ఆ ముప్పు పొంచి ఉండే అవకాశాలున్నాయని విశ్లేషకుల మాట.

మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే ?
అమెరికా టైమ్​ ప్రకారం ఈ మ్యాచ్​ ఉదయం 10.30 గంటలకు జరగనుంది. అది మన భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలు. ఇక ఈ మ్యాచ్ టాస్ రాత్రి 7.30కి జరగనుంది. ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ స్టార్‌ స్పోర్ట్స్​లో ఈ మ్యాచ్​ను మీరు లైవ్​లో వీక్షించవచ్చు. దూరదర్శన్ ఛానెల్‌లోనూ ఈ మ్యాచ్ ప్రసారం కానుంది. దీంతో పాటు ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లోనూ ఈ మ్యాచ్ స్ట్రీమ్ అవుతుంది.

కోచ్​గా 2007 టీమ్​ కెప్టెన్​ - ఈ టోర్నీతో ఆ ఇద్దరి కల తీరేనా? - T20 World Cup 2024

భారత్ x ఐర్లాండ్ - చిన్న జట్టే అయినా తగ్గేదేలే! - T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.