Ind vs Eng Lords Sourav Ganguly Celebration: టీమ్ఇండియా లెజెండరీ ప్లేయర్ సౌరభ్ గంగూలీ లార్డ్స్ మాస్ సెలబ్రేషన్స్‌కు శనివారం (జులై 13)తో 22ఏళ్లు పూర్తైంది. రెండు దశాబ్దాల కిందట గంగూలీ నేతృత్వంలోని టీమ్ఇండియా లార్డ్స్ మైదానం వేదికగా నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై చారిత్రక విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 325 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 49.3 ఓవర్లలో 8 కోల్పోయి గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.
అయితే ఈ విక్టరీని బాల్కనీలో ఉన్న టీమ్ఇండియా కెప్టెన్ గంగూలీ తన జెర్సీ తీసి మాస్ లెవెల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అప్పట్లో క్రికెట్ ప్రపంచంలో ఇది సంచలనంగా మారింది. ఇది టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ విజయంలో అప్పటి జట్టులో సభ్యులు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్ అదరగొట్టారు.
325 లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా ఓపెనర్లు సెహ్వాగ్ (45 పరుగులు), గంగూలీ (62 పరుగులు) తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. ఇక సచిన్ తెందూల్కర్ (14), ద్రవిడ్ (5) విఫలమయ్యారు. దీంతో మిడిలార్డర్లో యువరాజ్ సింగ్ (69 పరుగులు), మహ్మద్ కైఫ్ (87*) సూపర్ ఇన్నింగ్స్‌తో టీమ్ఇండియాకు సూపర్ విక్టరీ అందించారు.
#OnThisDay in 2002 📍 Lord's, London
— BCCI (@BCCI) July 13, 2021
A moment to remember for #TeamIndia as the @SGanguly99-led unit beat England to win the NatWest Series Final. 🏆 👏 pic.twitter.com/OapFSWe2kk
📍 Lord's
— BCCI (@BCCI) July 13, 2024
🗓️ 2002#OnThisDay, a heroic partnership between @YUVSTRONG12 & @MohammadKaif inspired #TeamIndia, led by @SGanguly99 to victory as they beat England to win the NatWest Series 🏆👏🏻 pic.twitter.com/ayLFNMfyBJ
ఆ విజయమూ చరిత్రకత్మకమే: 2021లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్, గబ్బా మైదానంలో 3 దశాబ్దాలకుపైగా తిరుగులేని ఆసీస్‌కు ఓటమి రుచి చూపించింది. అయితే గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాను ఓడించడం అంత సులువేమీ కాదన క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. అక్కడి ఫ్లాట్ పిచ్‌లపై పేసర్లు సంధించే బౌన్సర్లను ఎదుర్కొవడం కూడా బ్యాటర్లకు సవాలే. అప్పటివరకు ఆసీస్ గబ్బా గ్రౌండ్లో 1988లో వెస్టిండీస్‌తో ఓటమి పాలైంది. ఆ తర్వాత దాదాపు 3 దశాబ్దాలకు పైగా గబ్బాలో ఆసీస్‌కు ఓటమి లేదు. అయితే అదే గ్రౌండ్లో 2021 జనవరి 19న టీమ్ఇండియా, ప్రత్యర్థిని ఓడించడంతో యువ భారత్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి.
ఈ టెస్టు సిరీస్‌లో గబ్బా వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్ అజింక్యా రహానే, గిల్, మయంక్ అగర్వాల్, రిషభ్ పంత్, సుందర్ వంటి కుర్రాళ్లతో నిండిన టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1తో టీమ్ఇండియా కైవసం చేసుకుంది.
చారిత్రక విజయానికి మూడేళ్లు- 'గబ్బా' విక్టరీపై బీసీసీఐ స్పెషల్ ట్వీట్