ETV Bharat / sports

తొలి టెస్ట్​ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్రేక్​ : ఇంగ్లాండ్‌ ఆలౌట్​ - అదరగొట్టిన భారత బౌలర్లు - england first innings

Ind Vs Eng 2024 Test Series : హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా టీమ్​ఇండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​​ తొలి ఇన్నింగ్స్​లో ఆలౌట్ అయింది. 64.3 ఓవరల్లో ప్రత్యర్థి జట్టు 246 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్‌ 3, జడేజా 3, అక్షర్‌ పటేల్ 2, జస్‌ప్రీత్‌ బుమ్రా ఒక వికెట్‌ పడగొట్టారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 3:10 PM IST

Updated : Jan 25, 2024, 3:26 PM IST

Ind Vs Eng 2024 Test Series : హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా టీమ్​ఇండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్ ​ తొలి ఇన్నింగ్స్​లో ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్​ 64.3 ఓవరల్లో 246 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (88 బంతుల్లో 70; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదాడు. అయితే స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత స్పిన్నర్లు విజృంభించారు. ఎనిమిది వికెట్లు వారికే దక్కాయి. భారత బౌలర్లలో అశ్విన్‌ 3, జడేజా 3, అక్షర్‌ పటేల్ 2, జస్‌ప్రీత్‌ బుమ్రా 2 వికెట్‌ పడగొట్టారు. జానీ బెయిర్‌స్టో (37), బెన్‌ డకెట్ (35), జో రూట్‌ (29) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. అరంగేట్రం ఆటగాడు టామ్ హార్ట్‌లీ 24 బంతుల్లో 23 పరుగులు చేశాడు.

తొలి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు రెండో సెషన్‌లో మరింత తడబడుతూ ఆడింది. లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఐదు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. అలా 215/8 స్కోరుతో చివరి సెషన్‌ను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు మరో 31 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లు కోల్పోయింది.

సచిన్ రికార్డ్ బ్రేక్​ : ఇంగ్లాండ్​ స్టార్ క్రికెటర్‌ జో రూట్‌ ఓ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్​తో ఇండియాపై టెస్ట్ క్రికెట్​లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్‌ నిలిచాడు. ఈ తొలి టెస్టులో 10 పరుగుల వక్యిగత స్కోర్‌ వద్ద ఈ ఘనతను అందుకున్నాడు. రూట్‌ ఇప్పటివరకు 45 ఇన్నింగ్స్‌లలో 2555 రన్స్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్​ రికార్డును బ్రేక్‌ చేశాడు. భారత్‌ - ఇంగ్లాండ్​ టెస్టుల్లో సచిన్‌ 53 ఇన్నింగ్స్‌లలో 2535 రన్స్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌తో సచిన్‌ ఆల్‌ టైమ్‌ రికార్డ్​ బ్రేక్ అయింది. ఈ ఫీట్‌ సాధించిన ప్లేయర్స్ జాబితాలో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(1991) ఐదో స్ధానంలో నిలిచాడు.

ఉప్పల్​లో తిప్పేస్తున్న భారత స్పిన్నర్లు- రోహిత్, సిరాజ్ సూపర్ క్యాచ్​

భారత్xఇంగ్లాండ్- ఉప్పల్​ ఫైట్​కు ఇరుజట్లు రెడీ- బోణీ ఎవరిదో?

Last Updated : Jan 25, 2024, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.