Ind vs Eng 2024 Test Records: స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 4-1తో నెగ్గింది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో విజృంభించిన భారత్ 64 పరుగులు, ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన కుల్దీప్ యాదవ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డు', యశస్వీ జైస్వాల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కాయి.
ఈ మ్యాచ్‌లో నమోదైన పలు రికార్డులు
- 112ఏళ్ల తర్వాత ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడి 4-1తో సిరీస్‌ను దక్కించుకున్న కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. ఆ సిరీస్‌లో టీమ్ఇండియా హైదరాబాద్‌లో జరిగిన టెస్టులో ఓడిన తర్వాత వరుసగా విశాఖపట్టణం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల మ్యాచ్‌ల్లో నెగ్గింది.
- ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డు కొట్టాడు. ఈ సిరీస్‌లో అశ్విన్ 26 వికెట్లు నేలకూల్చాడు.
- 100వ టెస్టు ఆడిన అశ్విన్ ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఇక 100వ టెస్టులో 5వికెట్ల ప్రదర్శన చేసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు షేన్ వార్న్ (6-161), అనిల్ కుంబ్లే (5-89), ముత్తయ్య మురళీధరన్ (6-54), అశ్విన్ (5-77) ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిసి అశ్విన్ 9 వికెట్లు నేలకూల్చాడు.
- టెస్టు సిరీస్‌లో 700+ పరుగులు బాదిన రెండో భారత బ్యాటర్‌గా యశస్వీ జైస్వాల్ నిలిచాడు. ఈ సిరీస్‌లో జైస్వాల్ 712 పరుగులు చేశాడు. అతడి కంటే ముందు సునీల్ గావస్కర్ రెండుసార్లు ఈ ఘనత సాధించాడు.
- ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5వికెట్లు పడగొట్టాడు. కాగా, ఒక ఇన్నింగ్స్‌లో 5వికెట్ల ప్రదర్శన అశ్విన్‌కు ఇది 36వ సారి. ఈ లిస్ట్‌లో అందరి కంటే టాప్‌లో మరళీధరన్ (67) ఉన్నాడు. తర్వాత షేన్ వార్న్ (37), రిచర్డ్ హార్డ్లీ (36) ఉన్నారు. ఇక భారత్ తరఫున మాత్రం అశ్వినే టాప్.
- టెస్టు ఫార్మాట్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డ్ సాధించాడు. అతడు ఆస్ట్రేలియా (114 వికెట్లు), ఇంగ్లాండ్‌పై (114 వికెట్లు) పడగొట్టాడు. అశ్విన్ తర్వాత అనిల్ కుంబ్లే ఆస్ట్రేలియ (111 వికెట్లు)పై, కపిల్ దేవ్ (99 వికెట్లు) ఉన్నారు.
- 100వ టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ సరసన అశ్విన్ చేరాడు. ఇద్దరూ తమతమ 100వ మ్యాచ్‌లో 9 వికెట్లు ప్రదర్శన చేశారు.
టెస్టు ఫార్మాట్ ఫీజు పెంచిన బీసీసీఐ- ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షలు
ఆఖరి టెస్టు భారత్‌దే- బజ్‌బాల్‌ను పిండేసిన రోహిత్ సేన, 4-1తో సిరీస్ కైవసం