ETV Bharat / sports

కాన్పూర్ టెస్టులో టాస్ గెలిచిన భారత్ - ఆ ఛాలెంజ్​ను స్వీకరించిన రోహిత్ సేన - IND VS BAN Kanpur Second Test

author img

By ETV Bharat Sports Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

IND VS BAN Second Test : భారత్‌ - బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్ట్​ ప్రారంభమైంది. ఇందులో భాగంగా టాస్‌ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్​కు దిగింది. బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఒక టెస్టు గెలిచిన భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

source ANI
IND VS BAN Second Test (source ANI)

IND VS BAN Second Test : భారత్‌ - బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్ట్​ ప్రారంభమైంది. ఇందులో భాగంగా టాస్‌ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్​కు దిగింది. బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఒక టెస్టు గెలిచిన భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

అయితే కాన్పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలమని వార్తలు వచ్చాయి. దీంతో తుది జట్టులో మార్పులు జరుగుతాయని అంతా అనుకున్నారు. ముగ్గురు పేసర్లకు బదులు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందని, కుల్దీప్ - అక్షర్​లో ఒకరికి ఛాన్స్​ దక్కుతుందని భావించారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ అలా చేయలేదు. చెపాక్ టెస్టులో ఆడిన ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌లోనే కాన్పూర్ టెస్టుకు సిద్ధమయ్యాడు. స్పిన్ ఛాలెంజ్​ను స్వీకరించాడు! దీంతో తుది జట్టులో ఎలాంటి మార్పులు జరగలేదు.

బంగ్లాదేశ్ జట్టు మాత్రం రెండు మార్పులు చేసింది. నహీద్, తస్కిన్ స్థానంలో తైజుల్, ఖలీద్‌ను తీసుకున్నాడు కెప్టెన్ శాంటో.

జట్లు :

టీమ్​ ఇండియా - రోహిత్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, కోహ్లి, పంత్, కేఎల్‌ రాహుల్, జడేజా, అశ్విన్, ఆకాశ్ దీప్‌, బుమ్రా, సిరాజ్‌.

బంగ్లాదేశ్‌ - షద్మాన్, జాకీర్‌ హసన్, నజ్ముల్‌ శాంటో, మొమినుల్‌ హక్, ముష్ఫికర్, షకిబ్, లిటన్‌ దాస్, మెహిదీ హసన్‌ మిరాజ్, తైజుల్, హసన్‌ మహమూద్, ఖలీద్‌ అహ్మద్‌.

Kanpur Green Park Stadium Record : కాగా, కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో 1952 నుంచి టెస్టు మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 23 టెస్టు మ్యాచులు జరిగాయి. అందులో భారత్ 7 విజయం సాధించగా 3 సార్లు ఓడిపోయింది. ఇక ఈ కాలంలో దాదాపు 13 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 2010 తర్వాత న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు మాత్రమే ఇక్కడ ఆడింది. 2016లో భారత్ విజయం సాధించగా, 2021లో న్యూజిలాండ్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇకపోతే బంగ్లాదేశ్​తో అయితే మొత్తం ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడి, 11 విజయాలను నమోదు చేసింది భారత్​. రెండు సార్లు డ్రా చేసుకుంది.

'అతడి భద్రత మాకు సంబంధించినది కాదు' - షకిబ్​కు షాకిచ్చిన బీసీబీ - BCB ON SHAKIB AL HASAN SECURITY

క్లీన్​స్వీప్​ లక్ష్యంగా - రెండో టెస్ట్​కు సిద్ధమైన భారత్​! - IND VS BAN Second Test

Last Updated : 5 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.