ETV Bharat / sports

రోహిత్, కోహ్లీ, గిల్ వికెట్లుకూల్చిన 24ఏళ్ల యువ పేసర్‌ - ఇంతకీ అతడెవరంటే? - IND VS BAN Who is Hasan Mahmud - IND VS BAN WHO IS HASAN MAHMUD

IND VS BAN First Test : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమ్ ఇండియా స్టార్‌ బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. టాప్‌-3 కెప్టెన్ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ విఫలమయ్యారు. అయితే ఈ ముగ్గురిని 24 ఏళ్ల బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ హసన్‌ మహ్మద్​ ఔట్‌ చేయడం విశేషం. ఇంతకీ అతడు ఎవరంటే?

source Associated Press and  Getty Images
IND VS BAN First Test (source Associated Press and Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 19, 2024, 11:31 AM IST

IND VS BAN First Test : చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమ్ ఇండియా స్టార్‌ బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టాప్‌-3 భారత స్టార్​ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్​లో ఓపెనర్‌ రోహిత్‌ ఆరు పరుగులు మాత్రమే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ గిల్‌ డకౌట్​గా వెనుదిరిగాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు దిగిన కోహ్లీ కూడా ఆరు పరుగులకే వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. అయితే ఈ ముగ్గురిని బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ హసన్‌ మహ్మద్​ ఔట్‌ చేయడం విశేషం. రోహిత్‌ సెకెండ్‌ స్లిప్‌లో షాంటోకు క్యాచ్‌ ఇచ్చి ఔట్​ అయ్యారు. శుభ్‌మన్‌, కోహ్లీ వికెట్‌కీపర్‌ లిట్టన్‌ దాస్‌ చేతికి చిక్కారు.

ఇంతకీ హసన్ మహ్మద్ ఎవరంటే?(Who is Hasan Mahmud?)

హసన్ మహ్మద్​ బంగ్లాదేశ్​లోని చటోగ్రామ్​లో 1999లో జన్మించాడు. ఇప్పుడు ఇతడి వయసు 24 ఏళ్లు. 2020లో జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్​తో అంతర్జాతీయ క్రికెట్​లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి 18 టీ20లు ఆడి 18 వికెట్లు తీశాడు. వన్డేల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. 22 వన్డేలు ఆడి 30 వికెట్లు పడగొట్టాడు.

తన టెస్ట్ అరంగేట్రాన్ని ఈ ఏడాది లంక జట్టుపై చేశాడు. తన డెబ్యూ మ్యాచ్​లోనే 6 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. పాకిస్థాన్​పై టెస్ట్ సిరీస్​ గెలిచిన సమయంలో మరింత వెలుగులోకి వచ్చాడు. ఈ సిరీస్​లో 8 వికెట్లు తీశాడు. అందులో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది.

కాగా, వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25 భాగంగా భారత్‌- బంగ్లాదేశ్‌ రెండు టెస్ట్​ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మొదటి టెస్టుకు చెన్నై, రెండో టెస్టుకు కాన్పూర్‌ వేదికగా ఉంది. మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. బంగ్లాదేశ్‌ కూడా ఇదే ఫార్ములాను ఉపయోగించింది. ఎర్రమట్టి పిచ్‌పై మ్యాచ్‌ జరుతుండటం వల్ల ఇరు జట్లు పేసర్లకు ప్రాధాన్యత ఇచ్చాయి.

టాస్‌ నెగ్గిన బంగ్లా - బ్యాటింగ్​కు దిగిన భారత్‌ - ఈ టెస్ట్ సిరీస్​ ఫ్రీగా ఎక్కడ చూడాలంటే? - IND VS BAN FIRST TEST LIVE OTT

632 రోజుల తర్వాత 'టెస్ట్​'కు సిద్ధమైన పంత్‌ - గంభీర్‌ ఏమన్నాడంటే? - IND VS BAN Pant Test Cricket

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.