ETV Bharat / sports

బుమ్రా, సిరాజ్ అదుర్స్ - 149 పరుగులకే బంగ్లా ఆలౌట్ - IND vs BAN Test 2024

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

IND vs BAN Test 2024 : భారత్​తో జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్​లో 149 పరుగులకే కుప్పకూలింది.

IND vs BAN
IND vs BAN (Source : Associated Press)

IND vs BAN Test 2024 : భారత్​తో జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్​లో 149 పరుగులకే కుప్పకూలింది. పేస్​కు అనుకూలిస్తున్న చెపాక్ పిచ్​పై భారత బౌలర్లు చెలరేగిపోయారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 4 వికెట్లతో అదరగొట్టాడు. షకిబ్ అల్ హసన్ (32 పరుగులు) టాప్ స్కోరర్. మిరాజ్‌ (27 పరుగులు), లిట్టన్‌ దాస్‌ (22 పరుగులు), నజ్ముల్ షాంటో (20 పరుగులు) విఫలమవగా, మిగతా బ్యాటర్లు కూడా చేతులెత్తేశారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా 4, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో టీమ్ఇండియాకు తొలి ఇన్నింగ్స్​లో 227 పరుగుల ఆధిక్యం లభించింది.

టీమ్ఇండియా పేస్ దళం బంగ్లాను తొలి నుంచే ఇబ్బంది పెట్టింది. తొలి ఓవర్​ చివరి బంతికే బుమ్రా అద్భుతమైన స్వింగర్​తో ఓపెనర్ షద్మాన్ ఇస్లామ్​ (2)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్ టీమ్ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మరో ఓపెనర్ జాకీర్ హసన్ (3 పరుగులు)ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంటర్నేషనల్ కెరీర్ ఘనంగా ఆరంభించాడు. కెప్టెన్ షాంటో (20) కాసేపు క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా మన పేసర్లు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు.

భారత బౌలర్ల దెబ్బకు బంగ్లా వరుసగా వికెట్లను చేజార్చుకుంది. షాంటోతోపాటు ముష్ఫికర్ రహీమ్ (8) ఔట్ కావడం వల్ల బంగ్లా ఇన్నింగ్స్‌ వేగంగానే కుప్పకూలుతుందని అంతా భావించారు. కానీ, షకిబ్ అల్ హసన్ (32), లిటన్ దాస్ (22) ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించి ఇన్నింగ్స్​ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దర్నీ రవీంద్ర జడేజా తన వరుస ఓవర్లలో ఔట్ చేశాడు. ఆఖర్లో బుమ్రా, సిరాజ్ టెయిలెండర్ల వికెట్లు పడగొట్టి బంగ్లా ఇన్నింగ్స్​కు ఫుల్​స్టాప్ పెట్టేశారు.

కాగా, అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్​లో 376 పరుగులు చేసింది. ఓవర్​నైట్ స్కోర్ 339-6 తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియా మరో 37 పరుగులకే చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ (113 పరుగుల), రవీంద్ర జడేజా (86 పరుగులు)తో ఆకట్టుకున్నారు.

టెస్ట్ క్రికెట్​లో 'లంచ్'​​ - ఈ సమయంలో క్రికెటర్లు ఏం తింటారు? దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? - Lunch Break History In Test Cricket

అప్పుడు పాకిస్థాన్​పై 10, ఇప్పుడు భారత్​పై 9 - టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్​లో బంగ్లా పేసర్ల రికార్డ్​ - Teamindia First Innings Records

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.