ETV Bharat / sports

డే 1 కంప్లీట్- ఒక్కరోజే 17వికెట్లు- తొలి రోజు హీరో బుమ్రానే! - IND VS AUS 1ST TEST 2024

తొలి టెస్టులో డే 1 కంప్లీట్- 83 పరుగుల వెనుకంజలో ఆసీస్

Ind vs Aus 1st Test 2024
Ind vs Aus 1st Test 2024 (Source; AP)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 22, 2024, 3:39 PM IST

Ind vs Aus 1st Test 2024 : బోర్డర్ గావస్కర్ ట్రోఫీ భారత్- ఆస్ట్రేలియా తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 83 పరుగుల వెనుకంజలో ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 67-7. క్రీజులో అలెక్స్ కేరీ (19), మిచెల్ స్టార్క్ (6) ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా పేసర్లు ఆసీస్‌ బ్యాటర్లను బెంబేలెత్తించారు. పదునైన బౌన్సర్లతో రఫ్పాడించారు. ఈ క్రమంలోనే కెప్టెన్ బుమ్రా నాలుగు వికెట్లతో ఆసీస్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. ఇక మహ్మద్ సిరాజ్ 2, హర్షిత్ రాణా 1 వికెట్ దక్కించుకున్నారు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే టీమ్ఇండియా బౌలర్లు బుల్లెట్ లాంటి బంతులు సంధిస్తూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా భారత్‌కు మూడో ఓవర్‌లోనే బ్రేక్ ఇచ్చాడు. అరంగేట్ర కుర్రాడు నథన్ స్వీనే (10 పరుగులు)ను ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఆ తర్వాత ఏడో ఓవర్లో వరుసగా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. నాలుగో బంతికి మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (8 పరుగులు)ను ఔట్ చేయగా, తర్వాతి బంతికి క్రీజులోకి వచ్చిన స్మిత్‌ (0)ను పెవిలియన్‌కు చేర్చాడు.

ఇక డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ (11 పరుగులు)ను డెబ్యూ ప్లేయర్ హర్షిత్ రాణా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌ (6 పరుగులు) స్లిప్‌లో కేఎల్‌ రాహుల్‌కు చిక్కాడు. తర్వాత మార్నస్ లబుషేన్‌ (2)ను కూడా సిరాజే ఔట్ చేశాడు. ఆఖరి సెషన్‌లో బుమ్రా కెప్టెన్ కమిన్స్ (3 పరుగులు) వికెట్ దక్కించుకున్నాడు.

అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాటర్లలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (41 పరుగులు) టాప్ స్కోరర్. రిషభ్ పంత్ (37 పరుగులు), కేఎల్ రాహుల్ (26 పరుగులు), ధ్రువ్ జురెల్ (11 పరుగలు) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ డకౌట్‌గా అయ్యారు. విరాట్ కోహ్లీ (5), సుందర్ (4), హర్షిత్ రాణా (7), బుమ్రా (8) ఆకట్టుకోలేదు. ఆసీస్‌ బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ 4, కమిన్స్, మార్ష్ , స్టార్క్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.

బుమ్రా అరుదైన రికార్డ్- స్టెయిన్‌ తర్వాత ఆ ఘనత మనోడిదే!

టీమ్ ఇండియా ఆలౌట్​ - అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.