IND VD ENG Test Series 2024 Teamindia Young players : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచులో సిరీస్‌లో 3-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది టీమ్ ఇండియా. తద్వారా సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే ఇది పక్కా కుర్రాళ్ల విజయం. వాళ్లు రాణించకుంటే సుదీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై సిరీస్ ఓడేదే. అంచనాలను మించిన ప్రదర్శనతో జట్టుతో పాటు అభిమానులకు కొండంత భరోసానిచ్చారు మన యంగ్ ప్లేయర్స్.
IND VD ENG Test Series Yashasvi Jaiswal : సిరీస్‌ను భారత్ వైపు తిప్పిన ఘనత కచ్చితంగా యశస్వి జైశ్వాల్‌కే దక్కుతుంది. కోహ్లీ, రాహుల్, జడేజా అందుబాటులో లేక బ్యాటింగ్ పూర్తిగా బలహీనపడింది. హైదరాబాద్ మ్యాచ్‌లోనూ మనళ్లు ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితిలో విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లిష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు జైశ్వాల్. ఏకంగా డబుల్ సెంచరీ (209) బాదేసి భారత్‌కు అండగా నిలిచాడు. అతను వేసిన పునాదిపై బుమ్రా అద్భుత బౌలింగ్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు. రాజ్‌కోట్ టెస్టులోనూ యశస్వి (214 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. వెన్ను నొప్పిని తట్టుకుని మరీ ఆడి చెలరేగాడు. రాంచి టెస్ట్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు (73, 37) ఆడాడు. ఎంతో కసిగా ఆడుతూ తనలోని ఉత్తమ ప్రదర్శనను బయటికి తీశాడు.
IND VD ENG Test Series Dhruv Jurel : ఈ సిరీస్‌తో యశస్వితో పాటు తమ సత్తాను ప్రపంచానికి పరిచయం చేశారు ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్. ఐపీఎల్‌లో మెరుపులతో అందరి దృష్టిని ఆకర్షించిన ధ్రువ్ జురెల్ టెస్టుల్లోనూ అదరగొట్టాడు. తొలి రెండు టెస్టుల్లో కేఎస్ భరత్ వైఫల్యంతో అనుకోకుండా తనకు మూడో టెస్టులో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక తన రెండో టెస్టులో(అంటే సిరీస్‌లో నాలుగో టెస్ట్)నూ ప్రతికూల పరిస్థితుల్లో 90 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి చెలరేగాడు. జురెల్ చూపించిన పట్టుదల అసాధారణం. అతడి పోరాటం ఒకప్పుడు టెయిలెండర్లతో కలిసి వీవీఎస్ లక్ష్మణ్ చేసిన పోరాటాలను గుర్తు చేసింది. ఇక తన రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లోనూ కఠిన పరిస్థితుల్లో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు జురెల్.
IND VD ENG Test Series Sarfaraz khan : ఇక దేశవాళీల్లో పరుగుల వరద పారించి టీమ్‌ఇండియాలో చోటు కోసం ఎంతో కాలం ఎదురుచూసిన సర్ఫరాజ్‌కు ఇంత కాలానికి చోటు లభించింది. తనకొచ్చిన అవకాశాన్ని మూడో టెస్టులో అద్భుతంగా ఆడాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఎంతో కసిగా ఆడి హాఫ్ సెంచరీలు చేశాడు. అతడి స్ట్రోక్ ప్లే బాగుంది. మిడిలార్డర్లో మరో మంచి ప్రత్యామ్నాయంలా కనిపిస్తున్నాడు.
IND VD ENG Test Series Shubman Gill : మరోవైపు కెరీర్ ఆరంభంలో అద్భుతంగా రాణించి, ఆ తర్వాత గాడి తప్పిన మరో యంగ్ ప్లేయర్ ఆటగాడు శుభ్‌మన్ గిల్. తొలి టెస్టులో నిరాశపరిచిన అతడు ఆ తర్వాత మంచి ప్రదర్శనతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. విశాఖలో సెంచరీ (104) సాధించాడు. రాజ్‌కోట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 91 రన్స్ చేశాడు. నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్ (38, 52 నాటౌట్)లూ జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఇలా ఈ సిరీస్‌లో మొత్తంగా బ్యాటింగ్ భారాన్ని యంగ్ ప్లేయర్సే ప్రధానంగా మోశారు.
రెట్టింపు ఆనందంతో ఆర్సీబీ - చిన్నస్వామి వేదికగా రెండో విజయం
ఒలింపిక్స్ టు ఫిఫా - క్రీడా రంగంలో అద్భుతమైన మెగాటోర్నీలు ఇవే!