ETV Bharat / sports

వార్నర్​కు అల్లు అర్జున్ స్పెషల్ విషెస్- ఇంట్రెస్టింగ్​గా డేవిడ్ భాయ్ రిప్లై!

వార్నర్​కు విషెస్ చెప్పిన అల్లు అర్జున్ - 'మై బ్రదర్' అంటూ బన్నీ చేసిన పోస్ట్ వైరల్

Allu Arjun David Warner
Allu Arjun David Warner (Source : Getty Images (Left), ETV Bharat (Right))
author img

By ETV Bharat Sports Team

Published : Oct 27, 2024, 5:19 PM IST

Allu Arjun David Warner : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య మంచి బాండింగ్ ఉంది. వీళ్లిద్దరూ ఎప్పుడూ కలుసుకోకపోయినా సోషల్ మీడియాలో తరచూ పలకరించుకుంటారు. ఈ క్రమంలో హీరో అల్లు అర్జున్, డేవిడ్ వార్నర్​కు బర్త్ డే విషెస్ చెప్పారు. మై బ్రదర్ అంటూ బన్నీ చెప్పిన విషెస్​కు వార్నర్​ కూడా రిప్లై ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం ఇది ఇంటర్నెట్​లో ఫుల్ వైరల్​గా మారింది.

'పుష్ప రాజ్, తగ్గేదేలే' స్టైల్​లో ఉన్న వార్నర్ ఫొటోను బన్నీ షేర్ చేశారు. దీనికి 'నా సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అని రాసుకొచ్చారు. ఈ మేరకు ఆయన అఫీషియల్ ఇన్​స్టాగ్రామ్​లో స్టోరీ షేర్ చేశారు. దీనికి 'థ్యాంక్స్ బ్రదర్' అంటూ వార్నర్ రిప్లై ఇచ్చాడు. కాగా, గతేడాది కూడా బన్నీ, వార్నర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అటు బన్నీ బర్త్​ డే రోజు వార్నర్​ కూడా విషెస్ తెలుపుతాడు.

వార్నర్​కు బన్నీ విషెస్
వార్నర్​కు బన్నీ విషెస్ (Allu Arjun Insta Screenshot)

కాగా, వార్నర్​కు ఐపీఎల్​లో సన్​రైజర్స్ జట్టు తరఫున సమయంలో తెలుగు మూవీ లవర్స్​, క్రిక్రెట్ ఫ్యాన్స్​తో మంచి అనుబంధం ఉంది. ఇక అప్పట్లో బన్నీ నటించిన 'అల వైకుంఠపురంలో' సినిమాలోని పాటలకు, బన్నీ డైలాగ్స్​కు వార్నర్ రీల్స్ చేశాడు. మరీ ముఖ్యంగా పలుమార్లు గ్రౌండ్​లో 'పుష్ప తగ్గేదేలే' స్టైల్​లో సెలబ్రేషన్స్​ చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. ఇక బన్నీతోపాటు టాలీవుడ్​కు చెందిన పలువురు స్టార్ హీరోల పాటలకు స్టెప్పులు, డైలాగ్స్​ చెప్పి తెలుగు ఆడియెన్స్​కు చాలా దగ్గరయ్యాడు.

Warner Captaincy Ban Lifted: వార్నర్‌పై జీవిత కాల కెప్టెన్సీపై ఉన్న నిషేధాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు శుక్రవారం ఎత్తి వేసింది. వార్నర్​ అప్పీలును ముగ్గురితో కూడిన రివ్యూ ప్యానెల్‌ సమీక్షించి రీసెంట్​గా ఏకగ్రీవంగా నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో ఆరేళ్లుగా వార్నర్​పై ఉన్న కెప్టెన్సీ నిషేధం తొలగిపోయింది. ఇక వార్నర్ బిగ్‌బాష్‌ లీగ్‌లో నాయకత్వం చేపట్టే ఛాన్స్ ఉంటుంది. కాగా, 2018 సౌతాఫ్రికా పర్యటనలో ఆసీస్​ అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్​ సాండ్‌పేపర్ స్కాండల్‌ ఆరోపణలు ఎదుర్కొన్నారు.

డేవిడ్ వార్నర్‌పై 'జీవిత కాల' కెప్టెన్సీ నిషేధం ఎత్తివేత

ఒక్క రన్ తేడాతో 8 వికెట్లు ఔట్ - 53 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.