ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్​లో బుమ్రా టాప్- కోహ్లీ, రోహిత్ ఏ పొజిషన్​లో ఉన్నారంటే? - ICC Test Rankings 2024

ICC Test Rankings 2024 : ప్రతిష్టాత్మాక ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్​ తాజాగా విడుదలయ్యాయి. ఇందులో పలువురు భారత ప్లేయర్లు రాణించి తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. ఆ వివరాలు మీ కోసం.

ICC Test Rankings 2024
ICC Test Rankings 2024 (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 2, 2024, 3:50 PM IST

ICC Test Rankings 2024 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో టీమ్ ఇండియా ప్లేయర్లు అదరగొట్టారు. బౌలింగ్ విభాగంలో భారత జట్టు పేసర్ జస్ప్రీత్ బుమ్రా 870 రేటింగ్స్​తో అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే 869 పాయింట్లతో రవిచంద్రన్ అశ్విన్ రెండో ప్లేస్​లో ఉన్నాడు. అలాగే బ్యాటింగ్ విభాగంలోనూ టీమ్ ఇండియా బ్యాటర్ యశస్వీ జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 792 రేటింగ్స్​తో మూడో స్థానంలో నిలిచాడు. అలాగే కింగ్ కోహ్లీ ఏకంగా 6 స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో ప్లేస్​లో ఉన్నాడు.

అశ్విన్​ను వెనక్కినెట్టి టాప్​లో బుమ్రా
ఇటీవలే బంగ్లాతో జరిగిన టెస్టులో బుమ్రా ఆరు వికెట్లతో అదరగొట్టడం వల్ల అశ్విన్ ను ర్యాంకింగ్స్​లో వెనక్కినెట్టి మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. అలాగే టీమ్ ఇండియా ప్లేయర్ రవీంద్ర జడేజా 809 రేటింగ్స్​తో ఆరో ప్లేస్​లో ఉన్నాడు. అలాగే శ్రీలంక యువ సంచలనం ప్రభాత్ జయసూర్య ఒకస్థానం మెరురుపర్చుకుని 8 స్థానంలో నిలిచాడు. అయితే టాప్-10లో టీమ్ ఇండియాకు చెందిన ముగ్గురు బౌలర్లు చోటు దక్కించుకోవడం విశేషం.

టెస్టుల్లో టాప్-10లో ఉన్న బౌలర్లు

1. జస్ర్పీత్ బుమ్రా

2. రవిచంద్రన్ అశ్విన్

3. జోష్ హేజిల్ వుడ్

4. పాట్ కమిన్స్

5. కగిసో రబాడా

6. రవీంద్ర జడేజా

7. నాథన్ లయన్

8. ప్రభాత్ జయసూర్య

9. కైల్ జేమిసన్

10. షాహీన్ అఫ్రిదీ

టాప్-10లోకి దూసుకొచ్చిన విరాట్, జైస్వాల్
బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్ లో అదరగొట్టడం వల్ల టీమ్ ఇండియా బ్యాటర్లు యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ ర్యాంకులు మెరుగుపడ్డాయి. జైస్వాల్ 3, కోహ్లీ ఆరో స్థానంలో నిలిచారు. అలాగే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్ వరుసగా 5,3 స్థానాలు కోల్పోయి 15, 9వ స్థానంలో నిలిచారు. టెస్టుల్లో టాప్ లో ఇంగ్లాండ్ దిగ్గజం జో రూట్ ఉన్నాడు. 899 రేటింగ్స్ తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 829 రేటింగ్స్ తో కేన్ విలియమ్సన్ రెండో ప్లేస్ లో ఉన్నాడు. బ్యాటింగ్ విభాగంలో కూడా ముగ్గురు టీమ్ ఇండియా ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు.

టెస్టుల్లో టాప్-10 బ్యాటర్స్

1. జో రూట్

2. కేన్ విలియమ్సన్

3. యశస్వీ జైస్వాల్

4. స్టీవ్ స్మిత్

5. ఉస్మాన్ ఖవాజా

6. విరాట్ కోహ్లీ

7. మహ్మద్ రిజ్వాన్

8. మార్నస్ లబుషేన్

9. రిషభ్ పంత్

10. డార్లీ మిచెల్

ఆల్ రౌండర్లలో జడేజా టాప్
అలాగే టెస్టు ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్​లో టీమ్ ఇండియా ప్లేయర్ రవీంద్ర జడేజా 468 రేటింగ్స్​తో మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తర్వాతి స్థానాల్లో అశ్విన్, షకీబ్ అల్​ హసన్, జో రూట్, మెహీదీ హసన్ నిలిచారు.

ఒక్క సెంచరీతో ర్యాంకింగ్స్​లోకి పంత్ రీ ఎంట్రీ - రోహిత్, విరాట్ బిగ్ డ్రాప్ - ICC Ranking 2024

టాప్‌ 5లోకి రోహిత్- శ్రీలంక ప్లేయర్ ఏకంగా 42 స్థానాలు జంప్ - ICC Test Ranking 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.