ICC T20 World Cup 2024 : మరి కొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ టీమ్ఇండియా తరఫున ఆడనున్న 15 ప్లేయర్ల జాబితాపై అనిశ్చితి నెలకొంది. ఇందులోని చాలా స్థానాలకు ప్లేయర్ల మధ్య ఉన్న గట్టి పోటీయే ఇందుకు కారణమని క్రిటిక్స్ మాట. అయితే తుది జట్లను వెల్లడించాడానికి మే 1 లాస్ట్ డేట్ అయినందున రానున్న కొన్ని గంటల్లో బీసీసీఐ ఎప్పుడైనా తమ తుది జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
ఆ పెర్ఫామెన్స్ లెక్కలోకి రాదు :
ఇక టీమ్‌ను ఎంపిక చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఇలా పలువురు సభ్యులు ఆదివారం దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారట. ఇది కాకుండా మంగళవారం (ఏప్రిల్ 30న) అహ్మదాబాద్‌లో జరగనున్న సెలక్షన్ కమిటీ మీటింగ్‌లో జట్టుపై తుది నిర్ణయం తీసుకోనున్నారని టాక్.
లోక్‌సభ ఎన్నికల వల్ల బోర్డు సెక్రటరీ జై షా బిజీగా ఉండటం వల్ల మీటింగ్‌ను ఈ సారి అహ్మదాబాద్‌లో ఆర్గనైజ్ చేశారు. అయితే ఇప్పటికే ఆ 15 మంది ఎవరనేది విషయం ఖరారైందని తెలుస్తోంది. కానీ ఈ సారి ఐపీఎల్ ఆధారంగా కాకుండా ఓ వారల్ పెర్ఫామెన్స్‌ను బేస్ చేసుకుని ప్లేయర్లను ఎంపిక చేనుకున్నారట. ఐపీఎల్ పిచ్‌లకు పూర్తి భిన్నంగా వెస్టిండీస్‌లో పిచ్‌లు మందకొడిగా ఉండే అవకాశాల వల్ల, లీగ్‌లో టాప్ స్కోరర్లతో పాటు పతాక శీర్షికల్లో నిలుస్తున్న వారిలో కొందరికి జట్టులో చోటు దక్కకపోవచ్చు. ఇక విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఆరో టీ20 ప్రపంచకప్ ఆడనున్నాడు. ఈ మెగా టోర్నీ కోసం టీమ్ఇండియా ఫస్ట్ బ్యాచ్ మే 21న పయనమవ్వనుంది.
బ్యాకప్ కీపర్ సంగతేంటి ? : ఇదిలా ఉండగా, బ్యాకప్ ఓపెనర్, బ్యాకప్ వికెట్కీపర్లను ఎంచుకున్న విషయంలో సెలక్షన్ కమిటీ కన్ఫ్యూజన్ అవుతోందట. ఓపెనింగ్ విషయానికి వస్తే, రోహిత్‌తో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించడం ఖాయం. దీంతో శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చే అవకాశాలు లేనట్లే అని సమాచారం. ఒకవేళ గిల్‌ను తీసుకోవాలనుకుంటే, రింకు లేదా శివమ్ దూబెలు ఈ సారి అవకాశాలు కోల్పోయినట్లే.
ఇదిలా ఉండగా, జైస్వాల్‌కు గాయమైతే అతడి స్థానంలో కోహ్లి ఓపెనర్‌గా మారతాడు. కీపర్‌గా రిషబ్ పంత్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువే. దీంతో బ్యాకప్ కీపర్ స్థానం కోసం రాహుల్, సంజు శాంసన్‌ల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. 21 ఏళ్ల మయాంక్ యాదవ్ తన పేస్‌తో ఆకట్టుకుంటున్నప్పటికీ ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని అతడ్ని జట్టులోకి తీసుకోకపోవచ్చు.
టీమ్ఇండియాకు కొత్త వైస్ కెప్టెన్ అతడేనా? - T20 WORLD CUP 2024
పాక్ బోర్డు బిగ్ డెసిషన్ - ఛాంపియన్స్ ట్రోపీ కోసం ఆ ఈ 3 నగరాలు - ICC Champions Trophy 2024