T20 World Cup 2024 Song: ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం కావడానికి కేవలం 30 రోజులు మిగిలి ఉంది. ఇటీవల ఆయా దేశాలు తమ వరల్డ్ కప్ టీమ్‌లను ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా మినీ వరల్డ్ కప్ ఫీవర్ మొదలైంది. కాగా, ఐసీసీ పొట్టి ప్రపంచకప్ 2024 పాటను తాజాగా రిలీజ్ చేసింది. గ్రామీ అవార్డు విజేత సీన్ పాల్, సోకా సూపర్ స్టార్ కేస్ T20 ప్రపంచకప్ అధికారిక గీతం(Official Anthem) 'అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్' ను డిజైన్ చేశారు. ఇక పాట రిలీజ్‌తో వరల్డ్‌కప్ వేడుకలు మొదలైపోయాయి.
మ్యూజిక్ వీడియోలో బోల్ట్, గేల్: మైఖేల్ 'టానో' మోంటానో రూపొందించిన గీతం మ్యూజిక్ వీడియోతో సహా రిలీజైంది. వీడియోలో ఎనిమిది సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత ఉసేన్ బోల్ట్, క్రికెట్ స్టార్లు క్రిస్ గేల్, అలీ ఖాన్, శివనారాయణ్ చంద్రపాల్, ఇతర కరేబియన్ ప్రముఖులు గెస్ట్ రోల్స్‌లో కనిపించారు. మ్యూజిక్ వీడియోలో వాళ్లంతా క్రికెట్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ కనిపిస్తారు. ICC పురుషుల T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూడటానికి అభిమానులు వెళ్లినప్పుడు కలిగే వినోదం, ఉత్సాహాన్ని వీడియో చూపిస్తుంది.
ఈ సందర్భంగా గ్రామీ అవార్డు గ్రహీత సీన్ పాల్ మాట్లాడాడు. 'క్రికెట్, మ్యూజిక్ ఈ రెండింటికి ప్రజలను ఐక్యత, వేడుకలతో ఒకచోట చేర్చే శక్తి ఉందని నేను నమ్ముతున్నాను. ఈసాంగ్ పాజిటివ్ ఎనర్జీ, కరీబియన్ ప్రైడ్‌కి సంబంధించినది. క్రికెట్ కార్నివాల్ ప్రారంభమయ్యే వరకు నేను వేచి ఉండేను. ప్రతి ఒక్కరూ గీతంతో పాటు పాడటం మీరు వింటారు. వెస్టిండీస్, యూఎస్‌ఏలోని అన్ని స్టేడియంలో ఉత్సాహం కనిపిస్తుంది' అని చెప్పాడు. క్రికెట్ ఎల్లప్పుడూ కరేబియన్ సంస్కృతిలో ప్రధాన భాగం. కాబట్టి T20 ప్రపంచ కప్ కోసం అధికారిక గీతాన్ని రాసి, రికార్డ్ చేయడం గౌరవంగా భావిస్తున్నానని సోకా సూపర్‌స్టార్ కేస్ పేర్కొన్నాడు.
వేడుకలు మొదలు: ఐసీసీ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ జనరల్ మేనేజర్ క్లైర్ ఫర్‌లాంగ్ కూడా తాజాగా మాట్లాడాడు. 'ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి కేవలం 30 రోజులు మిగిలి ఉన్నాయి. అధికారిక గీతం విడుదల వేడుకలకు ప్రారంభం లాంటిది. ప్రపంచ అభిమానులు కలిసి ఒక అనుభూతిని పొందుతారు. సీన్ పాల్, కేస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఆర్టిస్ట్‌లు. మా అధికారిక గీతాన్ని రూపొందించినందుకు మేము సంతోషిస్తున్నాం. ఈ గీతం మా స్టేడియాలు, గ్లోబల్ బ్రాడ్‌కాస్ట్, ఐసీసీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వినబడుతుంది' అని వివరించారు. కాగా, యూఎస్, వెస్టిండీస్‌లో జూన్ 1 నుంచి 29 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. మెగాటోర్నీలో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి, 55 మ్యాచ్‌లు జరుగుతాయి.
'రాహుల్, రింకూను అందుకే పక్కన పెట్టాం- కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తప్పవు' - T20 World Cup 2024
టీ20 వరల్డ్ కప్ కోసం డ్రాప్ ఇన్ పిచ్‌లు - అసలు ఈ కొత్త టెక్నాలజీ ఏంటంటే? - ICC T20 World Cup 2024