T20 World Cup 2024 Free Entry: 2024 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు సమయం దగ్గరపడుతోంది. అక్టోబర్ 03న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ ప్రారంభం కానుంది. దుబాయ్, షార్జా వేదికలుగా ఈ టోర్నీని గ్రాండ్‌గా నిర్వహించేందకు ఐసీసీ ప్లాన్ చేస్తోంది. అయితే టోర్నీలో మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ ధరలను ఐసీసీ బుధవారం వెల్లడించింది. ఈ క్రమంలోనే యంగ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువతీ యువకులకు ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది.
రూ 115కే టిక్కెట్
ఇక మ్యాచ్ టికెట్ ధరను కూడా చాలా తక్కువగా నిర్ణయించింది. కేవలం 5 దుబాయ్ దిర్హమ్స్‌గా ధరను నిర్ణయించింది. అంటే రూ.115 కే స్టేడియంలో మ్యాచ్ చూసే అవకాశాన్ని ఐసీసీ కల్పించింది. మహిళల క్రికెట్‌కు సైతం క్రేజ్ తీసుకురావడంలో భాగంగా ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దుబాయ్ బుర్జ్ ఖలీఫా బిల్డింగ్‌పై వరల్డ్‌కప్ లేజర్ షో ప్రదర్శించింది.
అందరికీ హోమ్ గ్రౌండే!
అయితే ఈ T20 ప్రపంచ కప్ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్‌లో ఇటీవల రాజకీయ సంక్షోభం, అల్లర్లు మొదలవ్వడం వల్ల ఐసీసీ వేదికను మార్చాల్సి వచ్చింది. చివరికి టోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు యూఏఈ ముందుకొచ్చింది. అక్టోబర్ 3న బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్‌తో మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది.
మీడియా సమావేశంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జార్జ్ అలెర్డైస్ మాట్లాడారు. 'టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లకు UAE హోమ్‌గ్రౌండ్ లాంటింది. ప్లేయర్లందరూ ఇక్కడి ఫ్యాన్స్ సపోర్ట్ ఎంజాయ్ చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని టిక్కెట్ ధర కేవలం 5 దిర్హామ్‌లుగా నిర్ణయించాం. ఇక 18ఏళ్లలోపు వారికి ఫ్రీ ఇస్తున్నామని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను' అని పేర్కొన్నారు.
The iconic Burj Khalifa was lit up in Women's #T20WorldCup colours as ICC unveiled ticket details for the tournament 🏆https://t.co/OKg637slv7
— ICC (@ICC) September 11, 2024
టిక్కెట్‌లు ఎలా కొనాలి?
దుబాయ్, షార్జాలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన టిక్కెట్ ధరలను మాత్రమే బోర్డు అధికారులు ప్రకటించారు. టిక్కెట్‌లను ఎలా కొనుగోలు చేయాలనే వివరాలను వారు షేర్ చేయలేదు. టిక్కెట్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అభిమానులు క్రమం తప్పకుండా ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయాలి. టిక్కెట్లు త్వరలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
యూఏఈలో మహిళల టీ20 ప్రపంచకప్ - పూర్తి షెడ్యూల్ ఇదే - ICC Womens T20 World Cup