ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్​ - అదరగొట్టిన హర్మన్​ ప్రీత్​, షెఫాలీ - ICC T20 rankings - ICC T20 RANKINGS

ICC T20 Rankings : ఐసీసీ తాజా ర్యాంకింగ్స్​లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో

source Getty Images
ICC T20 Rankings (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 5:04 PM IST

ICC T20 Rankings : మహిళల టీ20 ర్యాంకింగ్స్​ను తాజాగా విడుదల చేసింది ఐసీసీ. ఈ ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మందాన టాప్ 10లో నిలిచింది. 729 పాయింట్లతో తన 5వ స్థానాన్ని పదిలం చేసుకుంది. టీమ్​ఇండియా ఓపెనర్​ షెఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్​ ప్రీత్ కౌర్ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. వర్మ(605 పాయింట్లు) రెండు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకును న్యూజిలాండ్​ అమెలియా కేర్, ఇంగ్లాండ్ డాని వ్యాట్​తో పంచుకుంది. ఇక మూడు ర్యాంకులు ముందుకు జరిగి 12 స్థానంలో నిలిచింది కెప్టెన్ హర్మన్​ ప్రీత్ కౌర్(613 పాయింట్లు). రీసెంట్​గా జరిగిన దక్షిణాఫ్రికాతో సిరీస్​తో మంచి ప్రదర్శన చేసి ఈ మార్క్​ను అందుకున్నారు.

బౌలింగ్ విభాగంలో 738 పాయింట్లతో దీప్తి శర్మ తన మూడో స్థానాన్ని పదిలం చేసుకుంది. రాధా యాదవ్ 8 స్థానాలను ఎగబాకి 15వ ర్యాంకుకు, పూజా వస్త్రాకర్​ ఆరు ర్యాంకులు ముందుకు జరిగి 23వ స్థానానికి, శ్రేయంక పాటిల్​ తొమ్మిది స్థానాలు ఎగబాకి 60వ ర్యాంకుకు చేరుకున్నారు. తొలి రెండు స్థానాల్లో సోఫీ ఎక్లేస్టోన్​, సారా గ్లెన్​ నిలిచారు. వీరిలో సోఫీ కెరీర్ హై రేటింగ్​ పాయింట్స్​ను(768) దక్కించుకుంది. ఇక ఆల్​రౌండర్​ విభాగంలోనూ 387 పాయింట్లతో మూడు స్థానంలో నిలిచింది దీప్తి శర్మ. టాప్​ - 10లో ఇతర టీమ్​ఇండియా ప్లేయర్లు ఎవరూ చోటు దక్కించుకోలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.