ETV Bharat / sports

ICC మహిళల వన్డే ర్యాంకుల్లో టీమ్ఇండియా ప్లేయర్ల జోరు! టాప్​ 10లోకి దూసుకెళ్లిన హర్మన్​ ప్రీత్ కౌర్ - ICC WOMEN ODI RANKINGS

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్​లో అదరగొట్టిన టీమ్​ఇండియా ప్లేయర్లు- టాప్​ 10లోకి దూసుకెళ్లిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్

ICC Women ODI Rankings
ICC Women ODI Rankings (IANS)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 5, 2024, 6:32 PM IST

ICC Women ODI Rankings : మహిళల ఐసీసీ వన్డే ర్యాంకులు వెలువడ్డాయి. భారత క్రికెటర్లతో పాటు న్యూజిలాండ్‌ ప్లేయర్లు తమ స్థానాలు, పాయింట్లను మెరుగుపర్చుకున్నారు. టీమ్‌ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(654) మూడు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంకుకు దూసుకెళ్లింది. న్యూజిలాండ్​పై వన్డే శకతం బాదిన స్మృతీ మంధాన ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం మంధాన(728) నాలుగో స్థానంలో కొనసాగుతోంది. గతంతో పోలిస్తే 703 పాయింట్ల నుంచి 728కి చేరింది. దీంతో టాప్‌ -3 ర్యాంకుకు చేరువగా వచ్చింది. లారా వాల్వార్డ్‌ట్‌ (756), నాట్‌ స్కివెర్ బ్రంట్ (760), చమరి ఆటపట్టు (733) మూడు స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (538) భారత్‌ తరఫున టాప్‌-20లో నిలిచిన మూడో ప్లేయర్‌ కావడం విశేషం. ప్రస్తుతం ఆమె ఒక ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని 19వ ప్లేస్​లో ఉంది.

మరోవైపు, బౌలింగ్‌ విభాగంలో దీప్తి శర్మ రెండో ర్యాంక్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం 703 పాయింట్లు సాధించిన ప్లేయర్ దీప్తి శర్మ ర్యాంకు విషయంలో మాత్రం మార్పు లేదు. కానీ పాయింట్లను కాస్త మెరుగుపర్చుకుంది. ఇక ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ (770) తొలి స్థానంలో ఉంది. భారత యువ బౌలర్ ప్రియా మిశ్ర ఏకంగా 77 స్థానాలను మెరుగుపర్చుకోవడం విశేషం. ఫలితంగా మొదటి సారి టాప్​-100 ర్యాంకుల్లోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం 271 పాయింట్లతో 83వ స్థానం దక్కించుకుంది. రేణుకా సింగ్‌ (424) కూడా నాలుగు స్థానాలను మెరుగుపర్చుకుని 32వ ర్యాంకుకు చేరింది. కాగా, ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ ఒక్క ప్లేయరే భారత్‌ నుంచి టాప్‌-10లో నిలిచింది. దీప్తి 378 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ విభాగంలో సౌతాఫ్రికా ప్లేయర్ మరిజన్నె కాప్ (404) అగ్రస్థానంలో ఉంది.

ఇదిలా ఉండగా, ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో 25 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 21 పాయింట్ల నుంచి 20 పాయింట్లకు పడిపోయిన న్యూజిలాండ్ ఆరో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ 28 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి.

'భారత్‌లోనే 2036 ఒలింపిక్స్‌ నిర్వహిస్తాం!'- ఇంటర్నేషనల్ ఒలింపిక్‌ సంఘానికి IOA లెటర్

''ఆమె' గోల్డ్​మెడల్ వెనక్కి తీసుకోండి'- ఒలింపిక్ బాక్సర్​​పై హర్భజన్ షాకింగ్ కామెంట్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.