Gavaskar Commensts England Bazball Strategy: ఇంగ్లాండ్ కొంతకాలంగా టెస్టు క్రికెట్లో బజ్‌బాల్ (దూకుడుగా ఆడే విధానం) వ్యూహంతో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా అప్పుడప్పుడు ఘోర పరాజయాలూ మూటగట్టుకుంది. ఈ విషయంపై అప్పట్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. ఫలితాలు ఎలా ఉన్న టెస్టుల్లో బజ్‌బాల్ వ్యూహాన్ని ఇంగ్లాండ్ వదులుకోదని స్పష్టం చేశాడు.
ఇక ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. జనవరి 25 నుంచి మార్చి 11 వరకు ఈ సిరీస్ జరగనుంది. మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన టీమ్ఇండియా మాజీ ప్లేయర్ సునీల్ గావస్కర్, ఇంగ్లాండ్ బజ్‌బాల్ విధానంపై కామెంట్స్ చేశాడు.
ఇంగ్లాండ్‌కు బజ్‌బాల్ వ్యూహం ఉంటే, టీమ్ఇండియాకు 'విరాట్ బాల్' ఉందని గావస్కర్ అన్నాడు.'మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచగల సత్తా విరాట్ కోహ్లీకి ఉంది. ప్రస్తుతం విరాట్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. టెస్టుల్లో సెంచరీలు దాదాపు హాఫ్ సెంచరీలతో సమానం. గత రెండేళ్లుగా టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్ బజ్‌బాల్ విధానంతో దూకుడుగా ఆడుతోంది. పరిస్థితులను లెక్క చేయకుండా ఎలాంటి పిచ్‌లపై అయినా ఇంగ్లాండ్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. మరి ఈ బజ్‌బాల్ ప్లాన్ భారత్ స్పిన్నర్లపై సాధ్యమేనా అని ఆసక్తిగా ఉంది. ఇంగ్లాండ్‌కు బజ్‌బాల్ ఉంటే, భారత్‌కు విరాట్ బాల్ ఉంది' అని గావస్కర్ అన్నాడు.
Virat Kohli Test Stats: విరాట్ కోహ్లీ టెస్టుల్లో ఓ అరుదైన రికార్డు అందుకునేందుకు దగ్గర్లో ఉన్నాడు. మరో 152 పరుగులు చేస్తే టెస్టుల్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ క్రమంలో టెస్టు ఫార్మాట్లో 9000 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్లలో సచిన్ తెందూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గావస్కర్ (10,122) విరాట్ కంటే ముందున్నారు. అయితే ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ మరో 152 పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. టెస్టుల్లో ఇప్పటివరకు 113 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 8848 పరుగులు చేశాడు. అందులో 29 సెంచరీలు ఉన్నాయి.
-
Virat Kohli needs 152 runs to complete 9000 runs in Test cricket.
— Johns. (@CricCrazyJohns) January 20, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
- The GOAT. 🐐 pic.twitter.com/tz95vkd1WT
">Virat Kohli needs 152 runs to complete 9000 runs in Test cricket.
— Johns. (@CricCrazyJohns) January 20, 2024
- The GOAT. 🐐 pic.twitter.com/tz95vkd1WTVirat Kohli needs 152 runs to complete 9000 runs in Test cricket.
— Johns. (@CricCrazyJohns) January 20, 2024
- The GOAT. 🐐 pic.twitter.com/tz95vkd1WT