Gautam Gambhir About Rohit Sharma : రోహిత్ శర్మ ఆట తీరు గురించి అందరికీ తెలిసిందే. ఏ ఫార్మాట్ అయినా సరే మైదానంలోకి దిగితే ఇక బాల్‌ను బౌండరీలను దాటిస్తాడు. అయితే తాజాగా ఈ స్టార్ క్రికెటర్ గురించి టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో రోహిత్ ఓ ప్రమాదకమైన బ్యాటర్ అని అప్పుడప్పుడు అతడి కోసం ప్లాన్-ఏ, ప్లాన్-బీ తో పాటు ప్లాన్-సీ కూడా వేయాల్సిన వచ్చేందంటూ తెలిపాడు. అతడి వల్ల తను నిద్ర లేని రాత్రులు గడిపారంటూ తాజాగా ఓ ఇంటర్వ్యలో పేర్కొన్నాడు.
''నాకు నిద్రలేని రాత్రుళ్లు మిగిలిచ్చిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ లాంటి క్రికెటర్లు గురించి నేనెప్పుడు ఆందోళన చెందలేదు. రోహిత్ కోసం ప్లాన్-ఏ, ప్లాన్- బీ వేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు ప్లాన్-సీ కూడా వేయాల్సిన పరిస్థితులు ఏర్పడేవి. రోహిత్ మైదానంలోకి దిగితే అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. రోహిత్ ఓ ప్రత్యేకమైన సవాలుగా అనిపిస్తాడు. అతడి కోసం ఎన్నో ప్లాన్స్ వేయాల్సి వచ్చేది. ఐపీఎల్ రోహిత్ శర్మ ఒక్కడే నన్ను భయపెట్టాడు. అతడి కోసం నేను వేనినన్ని ప్లాన్స్ మరే ఇతర ఆటగాడు కోసం చేయలేదు. ఇతరులకు ప్లాన్-ఏ సరిపోతుంది. కానీ రోహిత్ శర్మకి అలా సాధ్యం కాదు. మ్యాచ్ ముందు రోజు రాత్రి ఇలా ఆలోచించేవాడిని. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఎలా, మరొకటి తయారు చేయాల్సి ఉంటుంది. సునీల్ నరైన్ తన నాలుగు ఓవర్లు ముగిస్తాడు. మరి, మిగిలిన 16 ఓవర్ల పరిస్థితి ఏంటి? ఒకవేళ నరైన్ నాలుగు ఓవర్ల కోటా అయిపోయి రోహిత్ ఇంకా క్రీజులో ఉంటే ఏం చేయాలి? ఒకే ఓవర్‌లో 30 పరుగులు స్కోర్ చేయగల సత్తా అతడికి ఉంది. అందుకే రోహిత్ వల్ల నేను ఎక్కువ ఆందోళన చెందాను'' అంటూ రోహిత్ గురించి గంభీర్ మాట్లాడాడు.
Rohit Sharma IPL Winning Streak : 2013 సీజన్ మధ్యలో రోహిత్ కెప్టెన్సీ అందుకున్నాడు. అప్పటికి ఐదేళ్లుగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, హర్భజన్ సింగ్, ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు సాధ్యం కాని ఐపీఎల్ టైటిల్‌ను ముంబయికి రోహిత్ అందించాడు. ఆ తర్వాత కెప్టెన్‌గా అనేక రికార్డులు అందుకున్నాడు రోహిత్. అతడు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు. రోహిత్ కెప్టెన్సీలో 158 మ్యాచ్‌ల్లో 87 సార్లు ముంబయి ఇండియన్స్ నెగ్గింది. అంటే రోహిత్ విన్నింగ్ పర్సెంటేజీ 55.06గా ఉంది. అతడి కంటే ముందు మహేంద్రసింగ్ ధోనీ మాత్రమే ఉన్నాడు. ధోనీ 58.84 విన్నింగ్ పర్సెంటేజీతో 226 మ్యాచ్‌ల్లో 133 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజేతగా నిలిపాడు.
రోహిత్ కెప్టెన్సీని MI అసలెలా వదులుకుంది? కోహ్లీ 'కామెంట్స్' గుర్తున్నాయా?
'అలాంటి వారికి కెప్టెన్సీ ఇవ్వకూడదు'- టీ20 వరల్డ్‌కప్ సారథిపై గంభీర్ కామెంట్స్