ETV Bharat / sports

టీ20ల్లో వీరి దూకుడు మామూలుగా ఉండదు! రోహిత్​ కన్నా ఎక్కువ సిక్సర్లు కొట్టిందెవరంటే? - Cricketers WithMoreSixes Than Rohit - CRICKETERS WITHMORESIXES THAN ROHIT

Cricketers With More Sixers Than Rohit : టీ20 క్రికెట్‌లో రోహిత్‌ కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల గురించి తెలుసుకుందామా?

Rohit Sharma
Rohit Sharma (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 20, 2024, 8:25 PM IST

Top Batsmen More Sixes Than Rohit Sharma : సిక్సర్ల కింగ్‌ రోహిత్‌ శర్మ. అతడు బ్యాటింగ్ చేస్తుంటే సిక్సర్లు కొట్టడం ఇంత తేలిక అనిపిస్తుంటుంది. సునాయసంగా బంతిని బౌండరీ అవతల పడేస్తుంటాడు రోహిత్‌. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు కూడా. రోహిత్‌ కొట్టే ఆ హుక్‌ షాట్‌ సిక్స్‌ను చూసి తీరాల్సిందే. టీ20 క్రికెట్‌లో అయితే రోహిత్‌ విధ్వంసకర బ్యాటింగ్ క్రికెట్‌ ప్రేమికులకు వినోదాన్ని పంచుతుంది. అయితే టీ20 క్రికెట్‌లో రోహిత్‌ కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన మరికొందరి ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఇంతకీ వారెవరంటే?

క్రిస్ గేల్
బఠానీలు తిన్నంత ఈజీగా గేల్‌ సిక్సర్లు కొట్టేస్తుంటాడు! ఎంతటి భీకర బౌలర్‌ అయినా సరే గేల్ చాలా తేలిగ్గా సిక్సర్లు బాదేస్తుంటాడు. ఐపీఎల్‌లో పుణే వారియర్స్‌పై 175 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఇన్నింగ్స్‌ ఓ అద్భుతం. ఇప్పటివరకూ ఈ రికార్డు బద్దలు కాలేదు. T20 క్రికెట్‌లో 1056 సిక్సులతో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో గేల్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.

కీరన్ పొలార్డ్
తన ఆటతీరుతో బౌండరీ అవతలకు చాలా అవలీలగా బంతిని పంపగల విధ్వంసకర బ్యాటర్‌ పొలార్డ్‌. T20 క్రికెట్‌లో పొలార్డ్ 877 సిక్సర్‌లు కొట్టాడు. ఈ సిక్సుల సంఖ్య చూస్తేనే మనకు అర్థమవుతుంది. అతడు క్రీజులో నిలిస్తే విధ్వంసం ఎలా ఉంటుందో.

ఆండ్రీ రస్సెల్
రస్సెల్ ఇప్పటి వరకూ టీ20 క్రికెట్‌లో 704 సిక్సర్లు కొట్టాడు. అతడు బ్యాట్‌తో చేసే విధ్వంసాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను కూడా ఒంటిచేత్తో మలుపు తిప్పగల ఆటగాడు రస్సెల్‌.

కోలిన్ మున్రో
ఇతడికి ది సైలెంట్ డిస్ట్రాయర్ మున్రో అనే పేరు ఉంది. మున్రో ఇప్పటివరకూ 548 సిక్సర్‌లు కొట్టాడు. అందరి ఆటగాళ్లలా మున్రో పేరు అంతగా వినపడకపోయినా సిక్సర్లు కొట్టడంలో అతను చాలా సమర్థుడు. మున్రో టెక్నిక్ అద్భుతంగా ఉంటుంది. స్పిన్‌కి వ్యతిరేకంగా మున్రో భారీ సిక్సర్లు కొట్టగలడు.

నికోలస్ పూరన్
ఈ వెస్టిండీస్ క్రికెటర్ కేవలం 351 మ్యాచ్‌లలో 530 సిక్సర్లు కొట్టాడు. పూరన్‌ ఆట తీరు ఆరంభం నుంచి చాలా దూకుడుగా ఉంటుంది. అందుకే వెస్టిండీస్ లైనప్‌లో పూరన్‌ను అత్యుత్తమ ఆటగాడిగా పరిగణిస్తున్నారు.

రోహిత్ శర్మ
టీమ్ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకూ 525 సిక్సర్లు కొట్టాడు. నిలకడగా సిక్సులు కొట్టడంలో రోహిత్‌ను మించిన బ్యాటర్‌ లేడన్నట్లు ఆడుతుంటాడు. శర్మ హుక్‌ షాట్‌ కొట్టాడంటే ఇక కచ్చితంగా బంతి సిక్సు వెళ్లాల్సిందే.

రోహిత్ ఖాతాలో మరో రికార్డు - కెప్టెన్​గా అత్యధిక సిక్స్​లు బాదిన టాప్-5 బ్యాటర్స్ వీరే - Rohith Sharma Sixes Record

ODI World Cup 2023 IND VS PAK : మ్యాచ్ విన్నింగ్​ షాట్​.. రోహిత్​ సిక్సర్ల వీడియో మీకోసం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.