ETV Bharat / sports

విదేశీ జట్లకు కోచ్​లుగా టీమ్ఇండియా మాజీలు - లిస్ట్​లో ఎవరెవరంటే? - Indians As Foreign Team Coach - INDIANS AS FOREIGN TEAM COACH

Indians Foreign Teams Coach : టీమ్‌ఇండియాకు ఎక్కువగా విదేశీ కోచ్‌లు పని చేశారు. కొంత కాలంగా భారత మాజీ ప్లేయర్‌లు కోచింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి విదేశీ జట్లకు కోచ్‌లుగా పని చేసిన భారతీయుల గురించి మీకు తెలుసా?

Indians Foreign Teams Coach
Indians Foreign Teams Coach (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 29, 2024, 6:45 PM IST

Indians Foreign Teams Coach : భారత్‌ ఇప్పటి వరకు చాలా మంది అద్భుతమైన క్రికెటర్‌లను తయారు చేసింది. వీరిలో చాలా మంది క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యాక కూడా బంధాన్ని కొనసాగించారు. అలా భారత్​కు చెందిన చాలా మంది మాజీ క్రికెటర్లు విదేశీ జట్లకు కోచ్​లుగా వ్యవహరించారు. అద్భుతమైన విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే విదేశీ జట్లకు కోచ్‌గా పని చేసిన టీమ్ఇండియా మాజీ ప్లేయర్లు ఎవరు?ఇప్పుడు తెలుసుకుందాం.

  1. సందీప్ పాటిల్ : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సందీప్‌ పాటిల్‌ 1983లో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత్ జట్టులో సభ్యుడు. అలాగే టీమ్ ఇండియా తరఫున 29 టెస్టులు, 45 వన్డేలు ఆడాడు. తన క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత కెన్యా జట్టుకు కోచ్‌ గా పనిచేశాడు. అతని పర్యవేక్షణలో కెన్యా జట్టు 2003 వన్డే వరల్డ్ కప్​లో సెమీ ఫైనల్‌కు చేరి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పసికూనగా భావించే కెన్యా సంచలనం సృష్టించింది.
  2. లాల్‌ చంద్ రాజ్‌ పుత్ : లాల్ చంద్ రాజ్‌ పుత్ భారత్ తరఫున 2 టెస్టులు, 4 వన్డేలు ఆడాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచింగ్‌లో తన కెరీర్‌ను మార్చుకున్నాడు రాజ్ పుత్. ఆయన 2016- 2017 వరకు అఫ్గానిస్థాన్, 2018- 2022 వరకు జింబాబ్వే జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఈయన యూఏఈ జట్టుకు కోచ్​గా వ్యవహరిస్తున్నాడు.
  3. రాబిన్ సింగ్ : టీమ్ఇండియా మాజీ ఆల్ రౌండర్ రాబిన్ సింగ్ భారత్ తరఫున కేవలం ఒక టెస్టు, 136 వన్డే మ్యాచ్‌ లు ఆడాడు. 2004లో హాంకాంగ్ జట్టుకు రాబిన్ సింగ్ కోచ్​గా వ్యవహరించాడు. అలాగే అమెరికా క్రికెట్ జట్టుకు కూడా కోచ్​గా పనిచేశాడు. ఇక ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ సహా పలు టీ20 లీగ్​ల్సో ఆయా జట్లకు కోచ్​గా వ్యవహరించాడు.
  4. శ్రీధరన్ శ్రీరామ్ : టీమ్ఇండియా ప్లేయర్ శ్రీధరన్ శ్రీరామ్ తన కెరీర్ లో దేశం తరఫున 8 వన్డేలు ఆడాడు. 2015లో ఆస్ట్రేలియా A జట్టుకు కోచ్​గా వ్యవహరించాడు. 2019లో ఆసీస్ యాషెష్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
  5. అజయ్ జడేజా : టీమ్ఇండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా భారత్ తరఫున 15 టెస్టులు, 196 వన్డేలు ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత, జడేజా అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్​గా బాధ్యతలు చేపట్టాడు. జడేజా ఆధ్వర్యంలోనే అఫ్గాన్ జట్టు 2023 వరల్డ్ కప్​లో రాణించింది. భారత్​లో జరిగిన ఆ టోర్నీలో ఇంగ్లాండ్, పాక్ జట్లపై అఫ్గాన్ గెలిచి సంచలనం సృష్టించింది.

సింగిల్ బాల్​కు 286 రన్స్​ - పిచ్ మధ్యలో 6కిమీ పరుగు- క్రికెట్​లో రేర్ సీన్ - One Ball 286 Runs

498 పరుగులతో విధ్వంసం - 86 ఫోర్లు, 7 సిక్సర్లు- యువక్రికెటర్ ధనాధన్ ఇన్నింగ్స్ - 498 Runs In An Innings

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.