Faf Du Plessis IPL 2024: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శన కొనసాగించిన ఆర్సీబీ బౌలింగ్, బ్యాటింగ్‌లో విఫలమై 28 పరుగుల తేడాతో మరో ఓటమి మూటగట్టుకుంది. దీంతో ఇప్పటివరకూ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడగా, ఆర్సీబీ మూడింట్లో ఓడింది. అందులోనూ రెండుసార్లు సొంత మైదానం చిన్నస్వామిలో ఓడటం అర్సీబీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక మ్యాచ్ అనంతరం, అర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ తమ విజయావకాశాలను దెబ్బ తీసిన విషయాల గురించి మాట్లాడాడు.
'ఫీల్డింగ్ తప్పిదాలు చాలా సమస్యలు తెచ్చిపెట్టాయి. అందులోనూ క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్ క్యాచ్‌లను జారవిడచడం మ్యాచ్‌ను దూరం చేసింది. లైఫ్ వచ్చిన తర్వాత వాళ్లిద్దరూ పరుగుల వరద పారించారు. డికాక్ నుంచి ఇంతకుముందెన్నడూ ఇలాంటి ఆట చూడలేదు. మయాంక్ ఆట తీరు అద్భుతం. అతడు టాలెంటెడ్ బౌలర్. కొత్త బౌలర్‌ను ఎదుర్కొంటున్నప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇక మా బౌలింగ్ బాగుందని చెప్పడం లేదు. పవర్ ప్లేలో ఇంకా మంచి బౌలింగ్ చేయాల్సింది. ప్రారంభంలో బౌండరీలు ఇచ్చుకున్నా, డెత్ ఓవర్లలో పుంజుకున్నాం. కానీ, ఆ నిలకడ బ్యాటింగ్‌లో కొనసాగించలేకపోయాం. చక్కటి భాగస్వామ్యాలు నెలకొల్ప లేకపోయాం. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ బాగా ఆడింది. మేం మాత్రం మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం' అని డూప్లెసిస్ అన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగుల చేసింది. ఓపెనర్ డికాక్ (81 పరుగులు, 56 బంతుల్లో) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, చివర్లో నికోలస్ పూరన్ (40*, 21 బంతుల్లో) దూకుడుగా ఆడి జట్టుకు మంచి స్కోర్ కట్టబెట్టాడు. అనంతరం 182 పరుగుల లక్ష్య ఛేదనలో అర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకే చేతులెత్తేసింది. విరాట్ కోహ్లీ (22 పరుగులు), డూప్లెసిస్ (19 పరుగులు), మ్యాక్స్‌వెల్ (0), దినేశ్ కార్తిక్ (4) విఫలమయ్యారు. ఆఖర్లో ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లొమ్రోర్ (33 పరుగులు) రాణించినా జట్టును గెలిపించలేకపోయాడు.
ఆర్సీబీపై లఖ్‌నవూ విజయం- ఓడినా విరాట్, డీకే ఖాతాలో పలు రికార్డులు! - RCB vs LSG IPL 2024 Records
విజృంభించిన మయాంక్- చెలరేగిన డికాక్, పూరన్- ఆర్సీబీపై లఖ్‌నవూ విజయం - RCB vs LSG IPL 2024