ETV Bharat / sports

'ముంబయి సారథిగా హార్దిక్​ ఆ రెండు సమస్యలను ఎదుర్కోవాలి' - ఇర్ఫాన్​ ఈటీవీభారత్ ఎక్స్​క్లూజివ్​ - ఇర్ఫాన్ పఠాన్ ఈటీవీ ఇంటర్వ్యూ

ETV Bharat Exclusive Interview With Irfan Pathan : రానున్న ఐపీఎల్​ సీజన్​లో పలు జట్ల భవిత్వం గురించి టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్​ పఠాన్​ మాట్లాడారు. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఎక్స్​క్లూజివ్​ ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలను పంచుకున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 9:34 PM IST

Updated : Feb 8, 2024, 9:47 PM IST

ఈటీవీ భారత్​తో ఇర్ఫాన్ ఎక్స్​క్లూజివ్ ఇంటర్వ్యూ

ETV Bharat Exclusive Interview With Irfan Pathan : క్రికెట్​ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్​ సీజన్​కు సమయం ఆసన్నమైంది. దీంతో రానున్న మ్యాచుల కోసం ఆయా టీమ్స్​ తమ నెట్ట ప్రాక్టీస్​ను మొదలెట్టాయి. తమ జట్టుకు కప్​ తెచ్చిపెట్టాలంటూ ఆ టీమ్​ కెప్టెన్లు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో ఈ ఆటను చూసేందుకు క్రికెట్ లవర్స్​తో పాటు టీమ్ఇండియా మాజీలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్​ పఠాన్​ తాజాగా పలు టీమ్స్​పై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

"ఐపీఎల్​లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒక్కడు. అతడు తన ఆట ఆటతీరుతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అతని మైండ్​ ఓ కంప్యూటర్​లా పనిచేస్తుంది. మేము హిందీ కామెంటరీ చేసే సమయంలో అతడ్ని 'చాచా చౌదరి' అని పిలుస్తాము. ఐపీఎల్​లోనే టీమ్ఇండియాకు అతడు ఎన్నో అనేక అవార్డులను అందించాడు. ఇది అతడి చివరి సీజన్​ కాదని నేను కచ్చితంగా చెప్తాను. అతడు ఒంటికాలి మీద ఆడాలనుకున్నా, తన ఆటను ఆదరించేవారున్నారు. భవిష్యత్తులో మనం అతడి ఆటను చూడలేకపోవచ్చు కానీ తను ఎల్లప్పుడూ సీఎస్​కేలో భాగమే. ఒకవేళ ఇదే అతడి చివరి సీజన్ అయితే, ఎప్పటిలాగే ఈ సారి కూడా తన బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వాలని నేను ఆశిస్తున్నారు.

మరోవైపు ఐపీఎల్​లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు గురించి కూడా ఇర్ఫాన్​ మాట్లాడారు. ఇప్పటి వరకు ఒక్క సారి కూడా కప్​ను ముద్దాడని ఈ జట్టు ఈ సారైనా ట్రోఫీనీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇర్ఫాన్​ రిప్లై ఇచ్చారు.

"ఆర్సీబీ చాలా మంచి ఫ్రాంచైజీ. ఇక ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి విరాట్​ కోహ్లీ ఆ జట్టులో కీలక పాత్ర పోషిస్తూ ట్రోఫీని గెలవాలని ఎంతగానో కోరుకుంటున్నాడు. అలాగే తమ ఫ్యాన్స్​ కూడా నిరాశ చెందకుండా ఎప్పుడూ జట్టుకు సపోర్ట్​ ఇస్తుంటారు. ఇలాంటి ఫ్యాన్​డమ్​ను నేను ఎక్కడా చూడలేదు. ఈ ఏడాది లేకుంటే ఆ తర్వతైనా ఈ జట్టు కప్​ సాధిస్తుంది. అది జరిగితే మాత్రం ఇక ఐపీఎల్​లో ఓ కీలక ఘటను చూసినట్లే" అంటూ ఆర్సీబీ గురించి ఇర్ఫాన్ మాట్లాడారు.

ఇదిలా ఉండగా, ఇటీవలే ముంబయి ఇండియన్స్ జట్టు సారధ్య బాధ్యతలు అందుకున్న హార్దిక పాండ్య గురించి కూడా ఇర్ఫాన్ మాట్లాడారు. రానున్న సీజన్​లో ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం హార్దిక్​కు చాలా కష్టమైన పని అంటూ ఇర్ఫాన్​ అభిప్రాయపడ్డాడు.

"ముంబయి ఇండియన్స్​ సూపర్ జట్టే అయినప్పటికీ, అందులో ఇప్పటికే సూర్యకుమార్​ యాదవ్​, జస్ప్రీత్​ బుమ్రా లాంటి వాళ్లు ఉన్నందు వల్ల తిరిగి జట్టులోకి వచ్చిన హార్దిక్​కు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ముంబయి ఫ్రాంచైజీ హార్దిక్ విషయంలో రెండు అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది. ఇప్పటికే అతడు చాలా సార్లు గాయాలపాలయ్యాడు. అతడు టీమ్ఇండియాకు సంబంధించిన కొన్ని మ్యాచ్​లను తప్ప ఎప్పుడూ ఐపీఎల్​ను మిస్​ చేయలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయం గురించి ఫ్రాంచైజీలతో పాటు జట్టులోని ప్లేయర్​కు కాస్త భయం ఉంటుంది. మరోవైపు జట్టులోని కీలక ఆటగాళ్లను ఒక్కటి చేసి జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది హార్దిక్​పైనున్న భారం." అంటూ హార్దిక్​కు ఉన్న కీలక బాధ్యతల గురించి వివరించారు.

పెళ్లైన 8ఏళ్లకు భార్య ఫేస్ రివీల్- ఇర్ఫాన్ క్యూట్ కపుల్ ఫొటో చూశారా?

ఇర్ఫాన్​ పఠాన్ కుమారుడితో సచిన్​ కన్వర్సేషన్​.. వీడియో వైరల్​

Last Updated : Feb 8, 2024, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.