Ellyse Perry Dinner Date : ఐపీఎల్ లాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా సూపర్ పాపులరైంది. గతేడాది ప్రారంభమైన ఈ సిరీస్‌లో టీమ్ఇండియాతో పాటు పలు దేశాలకు చెందిన మహిళా ప్లేయర్లు పాల్గొని సందడి చేశారు. తమ స్టైల్లో ఆడి సత్తా చాటారు. ఇటీవలి ఎడిషన్ ఎంతో ఉత్కంఠగా సాగగా, అందులో ఆర్సీబీ ఉమెన్స్ జట్టు ఫైనల్స్‌లో చెలరేగి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శ్రేయాంక పాటిల్, స్మృతి మందన్నా, ఎలిస్ పెర్రీ లాంటి స్టార్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే అందరి దృష్టి మాత్రం ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీపై పడింది.
తొలి మ్యాచ్ నుంచి ఫైనల్స్ వరకు తన ఆటతీరుతో సత్తాచాటింది ఈ యంగ్ క్రికెటర్. ఎనిమిది ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సైతం సాధించింది. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ తన ట్యాలెంట్ చూపించి అందరినీ అబ్బురపరిచింది. అయితే ఈమె డబ్ల్యూపీఎల్ కంటే ముందు నుంచే ఈమె ఫేమస్. తన ఆట తీరుతోనే కాదు ఎలీస్ తన అందంతోనూ ఎంతో మందిని ఆకట్టుకుంది. తనకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఎంతలా అంటే ఒకానొక సందర్భంలో ఒ స్టార్ క్రికెటర్ ఆమెను డిన్నర్ డేట్‌కు తీసుకువెళ్లాని అనుకునేంతలా. ఎలిస్ ఒప్పుకుంటే తాను డిన్నర్‌కు తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నానని, ఆమె నుంచి సమాధానం రావడమే లేట్ అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు ఆ క్రికెటర్. ఇంచకీ అతడెవరో కాదు సీనియర్ టీమ్ఇండియా ప్లేయర్ మురళీ విజయ్.
క్రికెటర్లంతా కలిసి ఓ సందర్భంలో చిట్ చాట్ చేసుకుంటూ ఉండగా ఆయన తన మనసలోని మాటను బయటపెట్టాడు. అయితే అప్పట్లో విజయ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఓ రేంజ్లో ట్రెండ్ అయ్యాయి. అలా ఈ మాట ఎలిస్ చెవిన కూడా పడింది. అయితే దానికి ఎలిస్ చాలా కూల్‌గా సమాధానమిచ్చింది. 'ఆ హోటల్ బిల్ అతనే కడతానన్నాడు అది నాకు చాలా సంతోషంగా అనిపించింది' అంటూ చెప్పుకొచ్చింది.
ఎల్లీస్ పెర్రీ పనికి ఫ్యాన్స్ ఫిదా.. ఏం చేసిందో తెలిస్తే శభాష్ అనాల్సిందే!
కారు అద్దం పగలగొట్టిన ఆర్సీబీ బ్యాటర్ - ఇది నెక్ట్స్ లెవల్ హిట్టింగ్ బాస్!