DRS Controversy Ban vs SL 2nd T20: క్రికెట్లో కొంతకాలంగా డీఆర్‌ఎస్ టెక్నాలజీ వివాదాలకు దారి తీస్తుంది. ఇటీవల 2024 డబ్ల్యూపీఎల్, భారత్- ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో ఇలాంటి సంఘటనలు జరగ్గా, తాజాగా బంగ్లాదేశ్- శ్రీలంక టీ20 మ్యాచ్‌లో కూడా జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో వివాదం కాస్త ముదిరింది. ఏకంగా లంక ప్లేయర్లు ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు.
ఈ మ్యాచ్‌లో బంగ్లా ఇన్నింగ్స్‌లో బినురా ఫెర్నాండో 3 ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ తొలి బంతిని క్రీజులో ఉన్న సౌమ్య సర్కార్ (26 పరుగులు) షాట్ ఆడాడు. బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో బ్యాట్‌కు బంతి ఎడ్జ్ అయ్యిందని భావించిన లంక ప్లేయర్ల క్యాచౌట్కు అప్పీల్ చేశారు. వెంటనే ఫీల్డ్ అంపైర్ కూడా సౌమ్య సర్కార్‌ను ఔట్‌గా ప్రకటించాడు. సౌమ్య ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ రివ్యూ కోరాడు.
అయితే అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌ను తాకినట్లు రిప్లైలో తేలింది. కానీ బంతికి బ్యాట్‌కు మధ్యలో గ్యాప్ ఉందని భావించిన థర్డ్ అది నాటౌట్ ఇవ్వాల్సిందిగా ఫీల్డ్ అంపైర్‌కు సూచించాడు. అంతే ఒక్కసారిగా లంక ప్లేయర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. అది కచ్చితంగా ఔట్ అంటూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు మ్యాచ్ నిలిచిపోయింది. ఇక లెగ్ అంపైర్‌లో ఇందులో కలగజేసుకోని ఆటగాళ్లకు సర్ధిచెప్పారు. అయితే ఈ డీఆర్‌ఎస్ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు థర్డ్ అంపైర్ తప్పు అంటే, ఇంకొందరు అతడి నిర్ణయం సరైందేనని అంటున్నారు.
ఇక శ్రీలంక ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 165 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 18.7 ఓవర్లలో 170-2 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో నెగ్గింది. నజ్ముల్ హుస్సెన్ శాంటో (53) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మూడో టీ20 మార్చి 9న జరగనుంది.