ETV Bharat / sports

చెపాక్​లో చెన్నైదే పైచేయి- సన్​రైజర్స్​కు నాలుగో ఓటమి - IPL 2024 - IPL 2024

CSK VS SRH IPL 2024: 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్​కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం చెన్నై తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ 78 పరుగుల తేడాతో ఓడింది.

CSK VS SRH IPL 2024
CSK VS SRH IPL 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 11:00 PM IST

Updated : Apr 29, 2024, 6:32 AM IST

CSK VS SRH IPL 2024 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​ నాలుగో పరాజయాన్ని చవి చూసింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో 78 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్​లో చెన్నై నిర్దేశించిన 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్​రైజర్స్ 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. ఎయిడెన్ మర్​క్రమ్ (32 పరుగులు) టాప్​ స్కోరర్. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్​పాండే 4, ముస్తాఫిజుర్ రహ్మాన్, మతీషా పతిరణ చెరో 2, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. భారీ ఇన్నింగ్స్​తో అదగొట్టిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ (98 పరుగులు)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

భారీ లక్ష్య ఛేదనలో సన్​రైజర్స్​కు ఆదిలోనే షాక్​ తగిలింది. ఆ జట్టు ప్లేయర్ ట్రావిస్ హెడ్ తొలి వికెట్​గా వెనుతిరిగాడు. 13 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అన్మోల్‌ప్రీత్ సింగ్ (0) కూడా ఒక్క పరుగు కూడా చేయకుండానే మెయిన్‌ అలీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తన ఇన్నింగ్స్​లో మెరుపులు మెరిపిస్తాడనుకున్న అభిషేక్ శర్మ కూడా 15 పరుగులకే వెనుతిరిగాడు. దీంతో హైదరాబాద్ జట్టు 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

చెన్నై బౌలర్ తుషార్ దేశ్​పాండే పవర్​ ప్లేలోనే హైదరాబాద్ జట్టును శాసించాడు. ఆ తర్వాత పతిరణ చెన్నైకి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత నితీశ్‌ రెడ్డి (14), మర్​క్రమ్ (32 పరుగులు), కూడా పెవిలియన్ చేరారు. దీంతో సన్​రైజర్స్​ హెన్రీచ్ క్లాసెన్​ (20)పై ఆశలు పెట్టుకుంది. కానీ, సరైన సమయంలో పతిరణ క్లాసెన్​ను జట్టు స్కోర్ 117 వద్ద బోల్తా కొట్టించాడు. ఇక ఆ తర్వాత సన్​రైజర్స్ ఇన్నింగ్స్​ ముగియడానికి పెద్దగా టైమ్ పట్టలేదు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (98) పరుగులతో రాణించాడు. ఇక డారిల్ మిచెల్ (52) అర్ధ శతకం దాటి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్‌ దూబె (39) కూడా తన ఇన్నింగ్స్​లో మెరుపులు మెరిపించాడు. ఇక ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ (5) క్రీజులో ఉన్నది కొంతసేపే అయినా కూడా అభిమానులను ఆనందపరిచాడు. తొలి బంతికే ఫోర్ కొట్టి అదరగొట్టాడు. అయితే అనూహ్యంగా పెవిలియన్ బాట పట్టాడు.

రప్ఫాడించిన విల్ జాక్స్‌ - 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు - IPL 2024

సంజు శాంసన్​, జురెల్​ మెరుపులు - ఉత్కంఠ పోరులో లఖ్​నవూపై రాజస్థాన్​ విజయం - IPL 2024 LSG VS RR

Last Updated : Apr 29, 2024, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.