ETV Bharat / sports

జడేజా ఆల్​రౌండ్​ షో- 28 పరుగుల తేడాతో చెన్నై విజయం - IPL 2024 - IPL 2024

CSK vs PBKS IPL 2024: చెన్నై సూపర్​ కింగ్స్ ఆరో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 28 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో పంజాబ్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

CSK vs PBKS IPL 2024
CSK vs PBKS IPL 2024 (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 7:10 PM IST

CSK vs PBKS IPL 2024: IPL 2024 ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరో విజయం నమోదు చేసింది. ఆదివారం పంజాబ్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో 28 పరుగుల తేడాతో నెగ్గింది. చెన్నై నిర్దేశించిన 168 లక్ష్య ఛేదనలో పంజాబ్ 139-9 పరగులకే పరిమితమైంది. ప్రభ్​సిమ్రన్ సింగ్ (30 పరుగులు), శశాంక్ సింగ్ (27 పరుగులు) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3, సిమ్రన్​జీత్ సింగ్, తుషార్ దేశ్​పాండే చెరో 2, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

168 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ తొలి నుంచే తడబడింది. రెండో ఓవర్లోనే జాని బెయిర్ స్టో (7) దేశ్​పాండే బౌలింగ్​లో క్లీన్​బౌల్డయ్యాడు. వన్​డౌన్​లో వచ్చిన రొసో (0) డకౌట్​గా పెవిలియన్ చేరాడు. అలా ఒకే ఓవర్లో దేశ్​పాండే రెండు వికెట్లు పడగొట్టి పంజాబ్​ను దెబ్బతీశాడు. ఇక మరో ఓపెనర్​ ప్రభ్​సిమ్రన్ సింగ్ (30 పరుగులు) కాసేపు శశాంక్ సింగ్ (27 పరుగులు)తో కలిసి పోరాడాడు. కానీ, 7.6 వద్ద శాంట్నర్ శశాంక్​ను వెనక్కిపంపాడు. దీంతో 53 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

జడ్డూ మ్యాజిక్: ఈ సమయంలో బంతి పట్టిన జడ్డూ మ్యాజిక్ చేశాడు. ప్రభ్​సిమ్రన్ సింగ్​ను ఔట్ చేశాడు. ఆ తర్వాత 12వ ఓవర్లో శామ్ కరన్ (7), అశుతోష్ శర్మ (3)ను పెవిలియన్ చేర్చి పంజాబ్​ను తీవ్రంగా దెబ్బకొట్టాడు. ఆ తర్వాత హర్షల్ పటేల్ (12), రాహుల్ చాహర్ (16) కూడా ఔటయ్యారు. దీంతో పంజాబ్ 7వ ఓటమి మూటగట్టుకుంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్​ కింగ్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానే (9) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (32 పరుగులు), డారిల్ మిచెల్ (30 పరుగులు) పవర్​ప్లేలో స్కోర్ బోర్డను పరుగులు పెట్టించారు. వీరిద్దరూ రెండో వికెట్​కు 57 పరుగులు జోడించారు.

ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో రాహుల్ చాహర్ బ్రేక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో రుతురాజ్​, దూబేను పెవిలియన్ చేర్చాడు. తర్వాతి ఓవర్లోనే హర్షల్ పటేల్ మిచెల్​ను వెనక్కి పంపాడు. దీంతో ఒక్కసారిగా చెన్నై ఇన్నింగ్స్ గాడి తప్పింది. 101కే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రవీంద్ర జడేజా (43 పరుగులు) కీలక ఇన్నింగ్స్​తో జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించాడు. ఇక పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ చెరో 3, అర్షదీప్ సింగ్ 2, శామ్ కరన్ 1 వికెట్ దక్కించుకున్నారు.

దుబేకు ఏమైంది? వరల్డ్​కప్​కు ఎంపికైన తర్వాత వరుస డకౌట్లు- ఇలాగైతే కష్టమే! - IPL 2024

మ్యాక్సీ 'ఓవర్​రేటడ్'​ - మాజీ క్రికెటర్​కు తప్పని ట్రోల్ సెగ - Glenn Maxwell RCB

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.