ETV Bharat / sports

ఈ క్రికెటర్లు ప్రేమకు క్లీన్ బౌల్డ్- ఒక్కొక్కరిది ఒక్కో కథ - dinesh karthik love story

Cricketers Love Stories: కామన్ పీపుల్ లవ్ స్టోరీస్ కంటే సెలబ్రిటీల ప్రేమ కథలు ఇంట్రెస్టింగ్​గా ఉంటాయి. అలా టీమ్ఇండియాలోని స్టార్ ప్లేయర్లుందరూ లవ్ పడి, పెళ్లి చేసుకున్నారు. మరి ఈ స్టార్ల లవ్ స్టోరీలపై ఓ లుక్కేయండి.

Cricketers Love Stories
Cricketers Love Stories
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 3:14 PM IST

Cricketers Love Stories: వాలెంటైన్స్​ డే లవ్ బర్డ్స్​కు ఎంతో స్పెషల్. వారం రోజుల పాటు ఈ వాలంటైన్స్​ డేను సెలబ్రేట్ చేసుకుంటారు ప్రేమికులు. ఈ స్పెషల్​ రోజున చాలా మంది తమ పార్ట్​నర్​కు డిఫరెంట్ స్టైల్​లో ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేస్తుంటారు. దీనికి సినిమా హీరోలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు ఎవరూ అతీతం కాదు. అయితే టీమ్ఇండియా స్టార్లు కెప్టెన్ రోహిత్ శర్మ సహా, విరాట్ కోహ్లీ , ధోనీ ఇలా అనేక మంది క్రికెటర్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమకు క్లీన్ బౌల్డ్ అయిన క్రికెటర్లు ఎవరంటే?

సచిన్ తెందూల్కర్- అంజలి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్​ది ప్రేమ వివాహామే. 1990లో అంజలితో పరిచయం ఏర్పడిన సచిన్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత 1995లో వీరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి సారా, అర్జున్ తెందూల్కర్​ ఇద్దరు పిల్లలున్నారు. కాగా, అర్జున్ తెందూల్కర్ పలు డొమెస్టిక్ టోర్నమెంట్​ల్లో రాణిస్తున్నాడు.

గంగూలీ- డోనా: టీమ్ఇండియా మాజీ ప్లేయర్ సౌరభ్ గంగూలీ తన ప్రియురాలు డోనా గంగూలీని 1997లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

దినేష్ కార్తీక్- దీపిక: దినేష్ కార్తీక్ తన ప్రియురాలు దీపికతో ప్రేమలో మునిగితేలాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. 2013లో మారథాన్​లో తొలిసారి కలుసుకున్న వీరి ప్రేమకథ వెరైటీగా స్టార్ట్ అయ్యిందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

మహేంద్రసింగ్ ధోనీ-సాక్షి మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక పాప (జీవా సింగ్) పుట్టింది.

రోహిత్ శర్మ- రితికా: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతడి పర్సనల్ మేనేజర్ రితికా సజ్దేతో కొన్నేళ్లు లవ్ ట్రాక్ నడిపాడు రోహిత్. ఇక ఇరు కుటుంబాలను ఒప్పించిన ఈ జంట 2015 డిసెంబర్​లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. ఈ జంట 2018లో సమైరా అనే పాప జన్మించింది.

విరాట్ కోహ్లీ-అనుష్క: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ ఒక షాంపూ యాడ్​ కోసం కలిసి పని చేశారు. అయితే కోహ్లీ మరీ ప్రత్యేకంగా అనుష్కకు ప్రపోజ్ చేయలేదట. కానీ చూపులతోనే ఇద్దరు మనసులు కలవడం వల్ల వీరి ప్రేమ పెళ్లి వైపు అడుగులు వేసింది. అలా 2017 డిసెంబర్ 11న విరాట్- అనుష్క గ్రాండ్​గా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప (వామిక) ఉంది.

యువరాజ్ సింగ్- కీచ్: సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ ఫారిన్ అమ్మాయి హజేల్ కీచ్​ను ప్రేమించి పెళ్లాడాడు. వీరిద్దరూ 2016 నవంబర్ 30న గురుద్వారాలో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప, ఒక బాబు ఉన్నారు.

జహీర్ ఖాన్- సాగరిక: టీమ్ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్​కూడా లవ్​లో పడ్డాడు. అతడు సాగరికను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

హర్బజన్ సింగ్- గీతా బాస్రా: హర్బజన్ సింగ్- గీతా బాస్రా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ జలంధర్​లో భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

కమిన్స్​ భార్యకు నెటిజన్ లవ్ ప్రపోజల్- ఇంట్రెస్టింగ్​గా రిప్లై ఇచ్చిన క్రికెటర్

'అప్పటికి చాహల్ ఎవరో నాకు తెలీదు- ఆ ఒక్క మాటతో నచ్చేశాడు'- ధనశ్రీ లవ్​ కహానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.