ETV Bharat / sports

క్రికెట్​లో స్పెషల్ 'డే'- పటీదార్ సహా 8మంది ఇంటర్నేషనల్​ డెబ్యూ - rajat patidar Career

Cricketers International Debut In Single Day: భారత్ యంగ్ ప్లేయర్ రజత్ పటీదార్‌ ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో శుక్రవారం (ఫిబ్రవరి 02) అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో క్రికెట్​లో శుక్రవారం ఓ అరుదైన సంఘటన జరిగింది. ఒక్కరోజులో అత్యధిక ప్లేయర్లు అరంగేట్రం చేశారు. ఇవాళ ఎంతమంది క్రికెటర్లు ఇంటర్నేషనల్ కెరీర్​ ప్రారంభించారంటే?

Cricketers Debut In Single Day
Cricketers Debut In Single Day
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 4:03 PM IST

Updated : Feb 2, 2024, 4:14 PM IST

Cricketers International Debut In Single Day: ఏ క్రీడల్లోనైనా తమ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ప్లేయర్లందరికీ గర్వకారణం. కెరీర్​లో ఒక్కసారైనా జాతీయ జట్టులో స్థానం సంపాదించేందుకు ప్లేయర్లు ఎంతో కష్టపడతారు. కానీ, కొందరినే ఆ అదృష్టం వరిస్తుంది. అయితే భారత్- ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 02)న విశాఖపట్టణం వేదికగా రెండో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్​తో భారత యువ ఆటగాళ్లు రజత్‌ పటీదార్‌ టీమ్ఇండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతడు టీమ్ఇండియా మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ చేతులమీదుగా టెస్టు క్యాప్ అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో క్రికెట్​లో అరుదైన సంఘటన జరిగింది. శుక్రవారం (ఫిబ్రవరి 02) క్రికెట్ హిస్టరీలో అత్యధిక మంది ప్లేయర్లు అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోజుగా నిలిచింది. ఆయా దేశాల ద్వైపాక్షిక సిరీస్​లు, మ్యాచ్​లలో భాగంగా ఇవాళ 8మంది ప్లేయర్లు ఇంటర్నేషనల్ డెబ్యూ చేశారు. అందులో ఒక్క ఆఫ్గానిస్థాన్​ జట్టులోనే ఏకంగా నలుగురు ప్లేయర్లు అరంగేట్రం చేశారు. అయితే ఇంతకుముందు ఇలా భారీ సంఖ్యలో ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్​లో అడుగుపెట్టిన సందర్భాలు లేవు. మరి ఆ ప్లేయర్లవరంటే?

  • రజత్‌ పటీదార్‌ (భారత్)- భారత్‌ vs ఇంగ్లాండ్ మ్యాచ్
  • షోయబ్‌ బషీర్‌ (ఇంగ్లాండ్)- భారత్‌ vs ఇంగ్లాండ్ మ్యాచ్
  • జేవియర్‌ బార్ట్‌లెట్‌ (ఆస్ట్రేలియా)- ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ మ్యాచ్​
  • లాన్స్‌ మోరిస్ (ఆస్ట్రేలియా) - ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ మ్యాచ్
  • నూర్‌ అలీ జద్రాన్‌(అఫ్గానిస్థాన్)- అఫ్గానిస్థాన్ vs శ్రీలంక మ్యాచ్
  • నవీద్‌ జద్రాన్‌ (అఫ్గానిస్థాన్)- అఫ్గానిస్థాన్ vs శ్రీలంక మ్యాచ్
  • జియా ఉర్‌ రెహ్మాన్‌ అక్బర్‌ (అఫ్గానిస్థాన్)- అఫ్గానిస్థాన్ vs శ్రీలంక మ్యాచ్
  • మొహమ్మద్‌ సలీం (అఫ్గానిస్థాన్)- అఫ్గానిస్థాన్ vs శ్రీలంక మ్యాచ్

అఫ్గానిస్థాన్​ జట్టులోనే నలుగురు: అఫ్గానిస్థాన్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ టూర్​లో అఫ్గానిస్థాన్ ఆతిథ్య జట్టుతో ఒక టెస్టు, మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్​ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఈ టెస్టు మ్యాచ్​లోనే అఫ్గానిస్థాన్ నుంచి నలుగురు ప్లేయర్లు ఇంటర్నేషనల్ కెరీర్ ప్రారంభించారు.

'సిరాజ్​ను దానికోసమే పక్కనబెట్టాం' - బీసీసీఐ క్లారిటీ

అఫీషియల్ ఎంట్రీ - రెండో టెస్టుతో రజత్​ అరంగేట్రం

Last Updated : Feb 2, 2024, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.