Cricketers Holi Celebrations : దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే పిల్లలు, పెద్దలు అంతా కలిసి రంగుల పండగను ఆహ్లాదంగా జరుపుకొన్నారు. ఐపీఎల్ తొలి దశ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ హోలీ రంగుల్లో స్టార్ క్రికెటర్లు తడిసి ముద్దయారు. సరదాగా కాసేపు సేద తీరారు. ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సహచరులతో కలిసి రంగలు పూసుకుంటూ సందడి చేశాడు. చిన్నపిల్లాడిలా అయిపోయి తన జట్టు సభ్యులతో సందడి చేశాడు. ఇక రోహిత్‌తో పాటు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య ఇలా అందరూ కలిసి సరదాగా ఆడుకున్నారు.
మరోవైపు ఐపీఎల్‌లోని మిగతా ఫ్రాంచైజీలు కూడా హోలీ పండుగను గ్రాండ్‌గా జరుపుకున్నాయి. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఇలా అన్ని టీమ్స్ ప్లేయర్స్ రంగుల్లో తడిసి ముద్దయ్యారు. ఇక విదేశీ ప్లేయర్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ కనిపించారు.
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కిరిన్ పొలార్డ్ ఇలా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డీజే బ్రావో కూడా ఓ హోలీ ఈవెంట్లో పాల్గొన్నాడు. అక్కుడున్న అభిమానులతో కలిసి ఆడిపాడి అలరించాడు. మరికొంత మంది క్రికెటర్లు తమ ఫ్యామిలీలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, ముంబయి ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ఇలా పలువురు తమ కుటుంబ సభ్యులతో సంబరాలు చేసుకున్నారు.
-
Rang barse, DC ke andaz main 😍💙❤#YehHaiNayiDilli #Holi #IPL2024 pic.twitter.com/hNCx3WCmZv
— Delhi Capitals (@DelhiCapitals) March 25, 2024
ఐపీఎల్ రెండో షెడ్యూల్ ఔట్
బీసీసీఐ తాజాగా ఐపీఎల్ 17వ సీజన్‌కు సంబంధించిన ఫుల్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే తొలి విడత షెడ్యూల్‌ను అమలు చేయగా, రెండో షెడ్యూల్‌ను కూడా తాజాగా వెల్లడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో క్వాలిఫయర్ - 1 (మే 21న), ఎలిమినేటర్ (మే 24న) నిర్వహించనున్నారు. ఇక ఈ లీగ్ ఫైనల్ చెన్నై వేదికగా జరగనుంది.
ప్రస్తుత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌తో ఓవరాల్‌గా 74 మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రెండో విడత షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇక ఈ మ్యాచ్‌లు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా తొలి మ్యాచ్ చెన్నై, కోల్‌కతా జట్లు తలపడనున్నాయి.
సన్‌రైజర్స్ మ్యాచ్ - క్షణాల్లో మారిపోయిన కావ్య ఎక్స్ప్రెషన్స్ - Kavya Maran SRH
చెన్నైలోనే ఐపీఎల్ ఫైనల్! - ధోనీ కోసమేనా ఇదంతా? - IPL 2024 Final Venue