Cricketers Debut With Kohli But Faded Away : క్రికెట్‌లో సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం, అదృష్టం కొందరికే ఉంటుంది. జాతీయ జట్టులో చోటు సంపాదించడానికి ఎంతో కష్టపడతారు. కొందరు అంచనాలకు మించి రాణిస్తే, ఇంకొందరు ఊహించని రీతిలో కనుమరుగవుతారు. 2008లో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. క్రికెట్ ప్రపంచంలో కోహ్లీ అందనంత ఎత్తుకు ఎదుగుతాడని చాలా మంది ఊహించి ఉండరు.
క్రికెట్‌లో కోహ్లీ చాలా త్వరగా గుర్తింపు పొందాడు. అతడి తరంలోని గొప్ప క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. అయితే కోహ్లీతో పాటు వన్డే కెరీర్ ప్రారంభించిన మరో ఇద్దరి ప్రయాణం మాత్రం ఆశించినంత విజయవంతం కాలేదు. వాళ్లు ఎవరంటే?
ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్
1983లో సికింద్రాబాద్‌లో జన్మించాడు ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్. బ్యాటింగ్, మీడియం-పేస్ బౌలింగ్ చేయగలడు. మొదట ముంబయి తరఫున డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నాడు. దీంతో భారత జాతీయ జట్టులో అవకాశం లభించింది. 2009లో నాయర్ అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే అతడి కెరీర్ చాలా తక్కువ కాలంలోనే ముగిసింది. జాతీయ జట్టులో కేవలం మూడు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది.
అయినప్పటికీ, డొమెస్టిక్ క్రికెట్‌లో నాయర్ కీలక ప్లేయర్‌గా కొనసాగాడు. రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ సహా 5 వేలకు పైగా పరుగులు సాధించాడు. అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రెగ్యులర్‌గా మారాడు. ముంబయి ఇండియన్స్ వంటి జట్లకు ఆడాడు. అనంతరం కోచ్‌గా కొత్త జర్నీ ప్రారంభించాడు. భారత జట్టుతో కలిసి పని చేస్తున్నాడు.
స్పిన్ స్పెషలిస్ట్ ప్రజ్ఞాన్ ఓజా
1986లో భువనేశ్వర్‌లో జన్మించిన ప్రజ్ఞాన్ ఓజా ఎడమచేతి వాటం స్పిన్నర్. ప్రజ్ఞాన్ ఓజా 2008లో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. వన్డేల కంటే టెస్ట్ క్రికెట్‌లో ఎక్కువగా రాణించాడు. 2013లో ముంబయిలో సచిన్ తెందూల్కర్ చివరి టెస్ట్ మ్యాచ్‌లో పది వికెట్లు ప్రదర్శనతో హీరోగా నిలిచాడు.
అయితే ఓజా వన్డే కెరీర్ కేవలం 18 మ్యాచ్‌లకే పరిమితం అయింది. వీటిల్లో 21 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. తర్వాత రవీంద్ర జడేజా వంటి ఇతర స్పిన్నర్ల నుంచి గట్టి పోటీ ఎదురు కావడం వల్ల జట్టులో చోటు అస్థిరంగా మారింది. దీంతో టీ20 లీగ్‌లపై దృష్టి పెట్టాడు. కొంత కాలానికి క్రికెట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
Thank you @VVSLaxman281 anna for nominating me. Handlooms have a charm like no other and are a part of our nation's cultural heritage.
— Pragyan Ojha (@pragyanojha) August 7, 2022
Let's join hands and take pride in promoting our local handloom products. #NationalHandloomDay 😇 pic.twitter.com/MXE8Fnizf3
ఒక్క మ్యాచ్‌తో కెరీర్ ఫినిష్ - టీ20 తర్వాత క్రికెట్‌కు దూరమైన 5 ప్లేయర్స్ ఎవరంటే?
టన్నుల కొద్దీ పరుగులు - కానీ కెరీర్లో ఒక్క సెంచరీ కూడా లేదు! - Most Runs Without Century