ETV Bharat / sports

అయోధ్యకు ఆహ్వానం అందుకున్న క్రికెటర్లు వీరే! - క్రికెటర్లకు అయోధ్య ఆహ్వానం

Cricketers Ayodhya Invitation : జనవరి 22న జరిగే బాల రాముడి ప్రాణపత్రిష్ఠాపన మహోత్సవానికి దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందింది. వీరిలో క్రికెటర్లు కూడా ఉన్నారు. వారెవరంటే?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 9:24 PM IST

Cricketers Ayodhya Invitation : యావత్‌ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అపురూప ఘట్టం మరి కొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. జనవరి 22న బాల రాముడి ప్రాణపత్రిష్ఠాపన మహోత్సవానికి అయోధ్య నగరం సిద్ధమవుతోంది. ఇప్పటికే అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందింది.

క్రికెటర్స్​లో ఎవరంటే? ఇందులో భాగంగానే క్రికెట్‌కు సంబంధించి కూడా పలువురు దిగ్గజాలకూ ఈ ఆహ్వానం అందింది. వీరిలో దిగ్గజ క్రికెటర్‌, భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ తెందుల్కర్, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌, విరాట్ కోహ్లీలు ఉన్నారు. ఇంకా వీరితో పాటు టీమ్​ఇండియా మాజీ ప్లేయర్స్​ గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, టీమ్​ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా అయోధ్యను సందర్శించనున్నారు.

ఇక భారత మహిళల క్రికెట్​లో మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్​తో పాటు ప్రస్తుత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లకు ఈ ఆహ్వానం అందినట్లు తెలిసింది. మొత్తంగా ఆహ్వానం అందిన వారిలో దాదాపుగా ప్రతిఒక్కరూ కుటుంబసమేతంగా అయోధ్యకు వెళ్లే అవకాశం ఉంది.

ప్రాక్టీస్​కు బ్రేక్​ ఇచ్చి ప్రత్యేక విమానంలో : ప్రస్తుత భారత జట్టు సభ్యులైన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా ఇంగ్లాండ్​తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నారు. అయినా వీరు జనవరి 22న ప్రాక్టీస్​కు బ్రేక్ ఇచ్చి బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో(ayodhya ram mandir opening) భాగం కానున్నారని తెలిసింది. వీరందరూ ఇతర క్రికెట్‌ ప్రముఖులతో కలిసి ప్రత్యేక విమానంలో రాముడి జన్మస్థలమైన అయోధ్య నగరానికి వెళ్లనున్నట్లు సమాచారం అందింది. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని కథనాలు వస్తున్నాయి.

ఇంగ్లాండ్ జట్టుకు షాక్​ - టెస్ట్ సిరీస్​కు హ్యారీ బ్రూక్​ దూరం

టెస్టు ఛాంపియన్​షిప్​లో పరుగుల వీరులు - భారత జట్టులో టాప్ 10 వీరే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.